పర్వతగిరి మండల కేంద్రంలో నెక్ సహకారంతో ఎగ్ కార్ట్ లను పంపిణీ

 చేసిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి వినీత్ రావు

 

 

 

 

 

పర్వతగిరి ఫిబ్రవరి28 జనం సాక్షిపర్వతగిరి వర్ధన్నపేట , నియోజకవర్గం లో స్వయం ఉపాధి కోసం చూసే వారికి ఆసరాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్ధన్నపేట నియోజకవర్గానికి ఎగ్ కార్ట్ లు కావాలి అని నెక్ చైర్పర్సన్ అనురాధ దేశాయ్ ని సంప్రదించగా వారు వెంటనే స్పందించి పంపటం జరిగింది, వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలానికి ఈ రోజు సుమారు 35 ఎగ్ కార్టులను హార్హులు అయినా వారికీ పంపిణీ చేయటం జరుగుతుందని,అడగగానే ఎగ్ కార్ట్ లు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియచేసారు.ఈ సందర్బంగా ఎర్రబెల్లి వినీత్ రావు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ప్రతీ రోజు పోషక విలువలు ఉన్న కోడిగుడ్డు తిని ఆరోగ్యంగా ఉండాలి అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ యస్ మండల అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు ,పిఎసియస్ మాజీ చైర్మన్ మోటాపోతుల మనోజ్ గౌడ్,మాజీ ఎంపిటిసి మాడుగుల రాజు, మాజీ మండల అధ్యక్షులు ఏడుదోడ్ల జీతెందర్ రెడ్డి, మాజీ ఎంపిపి రజీత కుమారస్వామి లతో పాటు తదితరులు ఉన్నారు.