ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు
` టెహ్రాన్ అంతటా పేలుళ్ల మోత
` ఖమేనీ సహా పలు కీలక నేతల కార్యాలయాల సమీపంలో దాడులు
` పలువురు కీలక సైనిక, ప్రభుత్వాదికారుల మతి
` ఇరాన్‌లో బాలికల పాఠశాలపై దాడి.. 40 మంది మతి!
టెహ్రాన్(జనంసాక్షి):ఇరాన్‌పై ఇజ్రాయిల్,అమెరికాలు సంయుక్తంగా క్షిపణ దాడులకు దిగాయి అణు ఒప్పందంపై అమెరికా`ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు పాల్పడింది. టెహ్రాన్ అంతటా పేలుళ్లు వినిపించాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పొగ వ్యాపించింది. అమెరికా సాయంతోనే ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిని తామే చేశామని టెలఅవీవ్ ప్రకటించింది. శత్రు దేశం నుంచి పొంచివున్న ముప్ప్పును తప్పించేందుకు ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నివాసం, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ క్రమంలో టెలఅవీవ్ సైన్యం తమ దేశ ప్రజలను అప్రమత్తం చేసింది. వైమానిక దాడులు జరిగే అవకాశం ఉన్నందున దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. టెలఅవీవ్‌తో సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. స్కూళ్లు, కార్యాలయాలను మూసివేయాలని ఆదేశించింది. ఈ దాడుల్లో అమెరికా హస్తం కూడా ఉన్నట్లు అధికార వర్గాలను ఉటంకిస్తూ విÖడియాలో కథనాలు వస్తున్నాయి. తాజా దాడుల నేపథ్యంలో పౌర విమానాలకు ఇజ్రాయెల్ తన గగనతలాన్ని మూసివేసింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. అటు ఇరాన్, ఇరాక్‌లు కూడా గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇరాన్‌లో మొబైల్ ఫోన్ సేవలు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేపట్టింది. ఇరాన్ వైపు నుంచి క్షిపణులు దూసుకెళ్లాయి. ఈ మేరకు ఆ దేశ మిలిటరీ వెల్లడించింది. ఇజ్రాయెల్`అమెరికా కలిపి కొన్నిగంటల క్రితం ఇరాన్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నివాసం, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌వైపు నుంచి స్పందన వచ్చింది.
ఇరాన్‌లో బాలికల పాఠశాలపై దాడి.. 40 మంది మతి!
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికాలు దాడులతో విరుచుకుపడ్డాయి. హార్మోజ్‌గాన్ ప్రావిన్స్ మినాబ్ నగరంలోని ఓ బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో 40 మంది మతి చెందినట్లు స్థానిక విÖడియా వెల్లడించింది. మరో 45 మంది గాయపడినట్లు తెలిపింది. దాడి సమయంలో స్కూల్‌లో 170 మంది విద్యార్థినులు ఉన్నారని, మతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇరాన్ పారామిలిటరీ ‘ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర’కు ఈ ప్రాంతంలో స్థావరం ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి తమపై చేస్తున్న యుద్ధం చట్టవిరుద్ధమైనదని ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మండిపడ్డారు. ‘అమెరికా ఫస్ట’ నినాదాన్ని ట్రంప్.. ‘ఇజ్రాయెల్ ఫస్ట’గా మార్చారని విమర్శించారు. దురాక్రమణదారులకు తమ సాయుధ బలగాలు తగిన గుణపాఠం చెబుతాయన్నారు. ఇరాన్‌పై దాడులను రష్యా తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్, అమెరికాలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించింది. ఇది ముందస్తు ప్రణాళికతో కూడిన దురాక్రమణ చర్యగా పేర్కొంది. సమస్యల పరిష్కారానికి దౌత్య చర్చలు జరపాలని సూచించింది. సంబంధిత దేశాలు వెంటనే దాడులు ఆపాలని ఖతర్, సౌదీ అరేబియాలు డిమాండ్ చేశాయి.పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. దుబాయ్ నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. తదుపరి నోటీసులు జారీ చేసేవరకు దుబాయ్, అల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయాల కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇరాన్ ప్రతీకారదాడులు..
` రెడ్ కలర్‌లోకి ఇజ్రాయెల్ యాప్..
టెహ్రాన్(జనంసాక్షి):ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. ఇరాన్ వైపు నుంచి క్షిపణులు దూసుకెళ్లాయి ఈ మేరకు ఆ దేశ మిలిటరీ వెల్లడించింది. ఆ సమయంలో ఇజ్రాయెల్‌లోని హోమ్ ఫ్రంట్ కమాండ్ యాప్ ఎర్రగా మారిపోయింది. అది ఎప్పటికప్పుడు రియల్ టైమ్ హెచ్చరికలు, అత్యవసర మార్గదర్శకాలు చూపిస్తుంటుంది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులను అది గుర్తించడం వల్లే రెడ్ కలర్‌లోకి మారిపోయిందని అంతర్జాతీయ విÖడియా కథనాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్`అమెరికా కలిపి కొన్నిగంటల క్రితం ఇరాన్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నివాసం, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌వైపు నుంచి స్పందన వచ్చింది. ఆ సమయంలో ఉత్తర ఇజ్రాయెల్‌లో సైరన్ల మోత వినిపించింది. గగనతల రక్షణ వ్యవస్థ ఎప్పటికప్పుడు వాటిని అడ్డుకుంటోందని ఆ దేశ సైన్యం వెల్లడించింది. డ్రోన్లు, క్షిపణులతో తాము తొలుత ప్రతీకార దాడిని ప్రారంభించామని, ఇవి కొనసాగుతాయని ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్ తెలిపింది.
మా మాట వినకుంటే ఇరాన్‌ను నాశనం చేస్తాం
` ట్రంప్
వాషింగ్టన్(జనంసాక్షి):ఇరాన్‌పై యూఎస్`ఇజ్రాయెల్ చేపట్టిన సంయుక్త దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. తాము ఎన్ని హెచ్చరికలు చేసినా ఇరాన్ తన అణుకేంద్రాలను పునర్నిర్మించడానికి.. క్షిపణులను అభివద్ధి చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. అందువల్లే ఆ దేశానికి వ్యతిరేకంగా భారీ సైనిక చర్య చేపట్టామని వెల్లడించారు. ఇక ఎప్పటికీ ఇరాన్ అణ్వాయుధాలను కలిగిఉండకుండా వాటిని పూర్తిగా నాశనం చేస్తున్నామన్నారు. ఆ దేశ నాయకులు ఇప్పటికైనా తమ మాట వినకపోతే మొత్తం దేశాన్ని నాశనం చేస్తామని హెచ్చరించారు. ప్రపంచంలోని ఉగ్రవాదానికి ఇరాన్ అతిపెద్ద మద్దతుదారని ట్రంప్ అన్నారు. ఇటీవల నిరసనలు చేపట్టిన తన సొంత పౌరులనే అక్కడి ప్రభుత్వం వీధుల్లో దారుణంగా చంపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాద పాలనలో ఉన్న దేశం దగ్గర అణ్వాయుధాలు ఉండడం ప్రమాదకరమని.. అందువల్లే వాటిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇరాన్ పాలకుల ముప్పు నుంచి అమెరికాను రక్షించుకోవడమే తమ లక్ష్యమన్నారు. ఇకనైనా అణ్వాయుధాల కోసం వారు చేసే దుర్మార్గపు ప్రయత్నాలు మానుకోవాలని.. లేదంటే మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇరాన్‌తో అస్తిత్వ ముప్పు.. అందుకే దాడులు: నెతన్యాహు
టెలఅవీవ్(జనంసాక్షి):ఇరాన్‌పై దాడులను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమర్థించుకున్నారు. టెహ్రాన్ నుంచి తమకు అస్తిత్వ ముప్పు ఉందని, వీటిని తొలగించేందుకే అమెరికాతో కలిసి ఆపరేషన్ చేపట్టామని అన్నారు. ఇరాన్‌లోని క్షిపణి స్థావరాలు, పారామిలటరీ రెవల్యూషనరీ గార్డు, బాసిజ్ దళానికి చెందిన వాలంటీర్లపైనా దాడులు చేస్తున్నామన్నారు.“47 ఏళ్లుగా వారి పాలన ఇజ్రాయెల్, అమెరికాకు ముప్పుగా మారింది. ఎంతోమంది అమెరికన్లను బలి తీసుకోవడంతోపాటు తమ పౌరులనూ ఊచకోత కోసింది. ఇటువంటి వారికి అణ్వాయుధాలతో మానవాళిని బెదిరించే అవకాశం ఇవ్వకూడదు. ఇరాన్‌లోని అన్ని వర్గాలకు.. నిరంకుశ పాలన నుంచి విముక్తి, స్వేచ్ఛ, శాంతిని పొందే సమయం ఆసన్నమైంది” అని దేశ పౌరులను ఉద్దేశిస్తూ విడుదల చేసిన వీడియో సందేశంలో నెతన్యాహు పేర్కొన్నారు.ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యం ఇచ్చే ఆదేశాలను ఇజ్రాయెల్ పౌరులు పాటించాలని నెతన్యాహు సూచించారు. ఈ ఆపరేషన్ రానున్న రోజుల్లో కొనసాగే అవకాశం ఉందని, కలసికట్టుగా ధైర్యంగా పోరాడాల్సి ఉంటుందన్నారు.
ఇరాన్ నాయకత్వాన్ని టార్గెట్ చేశాం: ఇజ్రాయెల్
ఇజ్రాయెల్` అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ అగ్రనాయకత్వాన్ని టార్గెట్ చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు చెందిన పలువురు సీనియర్ కమాండర్లు.. పాలనా విభాగంలోని అత్యున్నత అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక విÖడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉత్తర టెహ్రాన్‌లోని 30 ప్రాంతాల్లో ఒకేసారి ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ అధ్యక్ష భవనం, కీలక ప్రభుత్వ కార్యాలయాల సవిÖపంలోనే ఈ దాడులు జరగ్గా.. మొదటి దాడి సుప్రీం లీడర్ కార్యాలయం సవిÖపంలోనే జరిగినట్లు అంతర్జాతీయ విÖడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే, ఆ సమయంలో ఖమేనీ టెహ్రాన్‌లో లేరని, అప్పటికే ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపాయి. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సైతం సురక్షితంగా ఉన్నట్లు టెహ్రాన్ విÖడియా వెల్లడించింది. ఈ వార్తలపై ఇరాన్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇదీ చదవండి: అట్టుడుకుతున్న పశ్చిమాసియా.. అమెరికా స్థావరాలపై దాడులు!
సంయమనం పాటించాలి.. దౌత్యమార్గాలను అనుసరించాలి
` పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ఆందోళన
` అక్కడి భారతీయులకు అలర్ట్
న్యూఢిల్లీ(జనంసాక్షి):ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ఇరాన్‌పై దాడులు.. ఆ దేశం ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌తోపాటు గల్ఫ్ ప్రాంతంలోని పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగశాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.“ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని పక్షాలు సంయమనం పాటించాలి. ఉద్రిక్తతలను నివారించాలి. పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉద్రిక్తతలను తగ్గించేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు చర్చలు, దౌత్యమార్గాలను అనుసరించాలి. అన్ని దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలి” అని భారత్ సూచించింది.పశ్చిమాసియాలోని భారత దౌత్య కార్యాలయాలు.. దేశ పౌరులతో టచ్‌లో ఉన్నాయని విదేశాంగశాఖ తెలిపింది. భారత పౌరులు అప్రమత్తంగా వ్యవహరించాలని, దౌత్య అధికారులతో కాంటాక్ట్‌లో ఉండాలని, స్థానిక భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కోరుతూ ఎంబసీలు అడ్వైజరీలు జారీ చేశాయని వెల్లడించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. భారతీయులకు అలర్ట్
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సంయుక్త సైనిక ఆపరేషన్‌తో పశ్చిమాసియా మరోసారి అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలోని భారత రాయబార కార్యాలయాలు అప్రమత్తమయ్యాయి. భారత పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, స్థానిక అధికారులు ఇచ్చిన సూచనలను పాటించాలని పేర్కొన్నాయి. ఈ మేరకు యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్ తదితర దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు అడ్వైజరీలు జారీ చేశాయి.“దేశంలో ఉన్న భారత పౌరులు అనవసర ప్రయాణాలు మానుకోండి. అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉంటూ యూఏఈ అధికారులు ఇచ్చిన భద్రతా మార్గదర్శకాలు పాటించండి” అని యూఏఈలోని భారత ఎంబసీ ప్రకటించింది. అబుదాబీలోని ఎంబసీ, దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ కార్యాలయాల్లో సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయని, అత్యవసర సమయాల్లో సంప్రదించవచ్చని తెలిపింది.సౌదీ అరేబియాలో ఉన్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. జెడ్డాలోని కాన్సులేట్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దష్ట్యా జోర్డాన్‌లోని భారతీయ పౌరులు, పర్యటకులు అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీలో పేర్కొంది. వాణిజ్య విమాన సర్వీసులకు అంతరాయం కలగకముందే భారతీయ పర్యటకులందరూ తక్షణమే జోర్డాన్‌ను వీడాలని సూచించింది.బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారులు ఇచ్చే మార్గదర్శకాలు, ఎంబసీ సూచనలు పాటించాలని తెలిపింది.పాలస్తీనాలో ఉన్న భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని రామల్లాలోని భారత ప్రతినిధి కార్యాలయం వెల్లడించింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. వీటితోపాటు ఇజ్రాయెల్, ఇరాన్‌లలోని భారత రాయబార కార్యాలయాలు అనవసర ప్రయాణాలు చేయొద్దంటూ అక్కడ ఉన్న మన పౌరులను హెచ్చరించాయి. ఇజ్రాయెల్‌లోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని అక్కడి రాయబార కార్యాలయం కోరింది.



