బీసీ మహాధర్నాను విజయవంతం చేయాలి

 

 

 

 

 

సూర్యాపేట (జనంసాక్షి): ఈ నెల 2న హైదరాబాదులో జరిగే బిసి మహాధర్నాను విజయవంతం చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నల్గొండ జిల్లా ఇంచార్జ్ డేగల జనార్ధన్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో కలిసి పాల్గొని మాట్లాడారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పార్టీలు మాటలు మాత్రమే మాట్లాడుతున్నాయని అన్నారు.వారి అభ్యున్నతి కోసం ప్రత్యేకమైన బడ్జెట్ ఇవ్వాలని, అందుకోసం బీసీ సబ్ ప్లాన్ అమలుపరచాలని డిమాండ్ చేశారు.బీసీలను నిందించే సందర్భంలో వారిని చట్టబద్ధంగా కాపాడేందుకు బీసీ అట్రాసిటీస్ చట్టం రాబోయే శాసనసభ సమావేశాల్లో రూపొందించాలని అన్నారు. ఈ రెండు డిమాండ్లతో పాటుగా అనేక ఇతర అంశాలను చర్చించేందుకు బడుగు బలహీన వర్గాల ఐక్యతను మరింత పెంపొందించేందుకు పోరాట రూపాలు దోహదం చేస్తాయని అన్నారు.మార్చి 2న హైదరాబాదులో జరిగే మహాధర్నాకు విస్తృతంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. బీసీల ఐక్యత వల్ల ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించామని రాజ్యాధికారమే పరమావధిగా తమ కార్యక్రమాలు ఉంటాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న అన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి వట్టె జానయ్య యాదవ్,రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్,పార్టీ జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్,జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల గౌడ్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, పట్టణ అధ్యక్షులు కుంభం నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఏశబోయిన మల్లేష్ యాదవ్, పెన్ పహాడ్ మండల అధ్యక్షులు ఆవుల అంజయ్య యాదవ్, ఆత్మకూరు ఎస్ మండల అధ్యక్షులు బొల్లె సైదులు, యగ్గడి మురళి, వట్టె లింగరాజు తదితరులు పాల్గొన్నారు