కల్లుగీత కార్మికులకు పెన్షన్ మంజూరు చెయ్యాలి

 

 

 

 

 

ఏటూరునాగారం కల్లుగీత కార్మిక సంఘం ఉపాధక్షులు మెరుగు రఘు గౌడ్ ఆవేదన

ఏటూరు నాగారంమార్చి 01 (జనం సాక్షి) .మండల కేంద్రంలో ని తాళ్లగడ్డ సమీపంలో గౌడ సంఘం ఉపాధ్యక్షులుమెరుగు రఘు గౌడ్, మాట్లాడుతూ గీత కార్మికులు ప్రామాదకరమైన వృత్తినిచేస్తున్నారని దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని గత
బిఆర్ఎస్ ప్రభుత్వం గీతకార్మిక సమస్యలు తెలుసుకొని అందరికి 50 సంవత్సరాలు వస్తే పెన్షన్ ఇవ్వాలని గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు మా వయస్సు 50 సంవత్సరాలు పైన పడుతున్న మాకు పెన్షన్ రావటం లేదు అని కళ్ళు సేవించడానికి వచ్చిన వారితో చెప్పుకుంటూమెరుగు రఘు గౌడ్, ఆవేదన వ్యక్తం చేస్తూ, మమల్ని ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ను వేడుకున్నారు.