ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా

ఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయసభల్లో ఈ రోజు బొగ్గు గనుల కేటాయింపులపై గొడవ కొనసాగింది. ఇందుకు ప్రధానే కారణమని ఆయన రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. సభలను జరగనిస్తే చర్చిద్దామని ఉభయసభల స్పీకర్లు చెప్పినా వారు వినకుండా ఆందోళన చేయటంతో ఉభయసభలను మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా వేశారు.