ఉమ్మడి రాజధానికి ఒప్పుకునేదే లేదు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఢిల్లీలో తెలంగాణ పోరు దీక్షా కార్యక్రమాన్ని ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇక్కడ గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్రం తెలంగాణ ఇవ్వకుండా అభివృద్ధి మండలి, ఉమ్మడి రాజధాని అంటే ఒప్పుకునేదే లేదని తేల్చి చెప్పారు. ప్రత్యేక రాజధానిని నిర్మిస్తేనే సీమాంధ్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు.