ఉర్దూ పాఠశాలలు ఏర్పాటు చేయాలి

కడప, జూలై 11 : జిల్లాలోని ప్రతి మండలంలోను ఉర్దూ పాఠశాలలు పాఠశాలలు ఏర్పాటు చేయాలని అవాజ్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడు మస్తాన్‌వలీ డిమాండ్‌ చేశారు. మైనార్టీలకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. విద్యారంగంలో మైనార్టీ యువత ముందుకు సాగాలని ఆయన బుధవారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. శారీరక శ్రమనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న మైనార్టీలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు. కొన్ని మైనార్టీ విద్య సంస్థలు నేడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని, వాటిని ప్రభుత్వమే రక్షించాలని ఆయన కోరారు. ప్రభుత్వం మైనార్టీల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని చెప్పారు.