ఎంజీఎంలో మరో చిన్నారి మృతి
వరంగల్: ఎంజీఎం ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు కొనసాగుతున్నాయి. పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మూడెళ్ల బాలుడు నాగరాజు ఈ ఉదయం మృతి చెందాడు. దీంతో నిన్న రాత్రి నుంచి ఆసుపత్రిలో మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. పిల్లల మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి అవరణలో ఆందోళనకు దిగారు.