ఎంపీ శతృఘ్నసిన్హాకు బైపాస్‌ శస్త్రచికిత్స

ముంబాయి : నిన్నటి తరం మేటి నటుడు, పార్లమెంట్‌ సభ్యుడు (60)కు సోమవారం  బైపాస్‌ శస్త్రచికిత్స జరిగింది. ఆయన మరి కొన్నిరోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంటారు. ఆయన నివాసంలో రంగులు వేస్తున్న నైపథ్యంలో తనకేమిటో ఊపిరి అడనట్లుగా ఉందంటూ శతృఘ్నసిన్హా చెప్పడంతో ఈనెల రెండో తేదిన ఇక్కడి కోకిలాబెస్‌ ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల్లో ధమనులు పూడుకు పోయినట్లు గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్సను సిఫారసు చేసినట్లు కోకిలాబెస్‌ ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం  శతృఘ్నసిన్హా  కోలుకుంటున్నారనీ.. మరో వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారని చెప్పారు.