ఎన్నార్పీఎం పాఠశాల శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం
చీరాల : ప్రకాశం జిల్లా ఎన్నార్పీఎం పాఠశాల శతాబ్ది ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. వీటిని మాజీ ఎన్నికల కమిషనర్ జీవీజీ కృష్ణమూర్తి ప్రారంభించారు. సభలో పాల్గోన్న తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య మాట్లాడుతూ పూర్వం విద్యాభివృద్ధికి దాతలు నిస్వార్థంతో కృష్ణి చేశారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ మాతృభాషను అభిమానించాలన్నారు. జీవీజీ కృష్ణమూర్తి మాట్లాడుతు తాను వివిధ హోదాల్లో రాణించానంటే దానికి పాఠశాల అందించిన విజ్ఞానమే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో 108 మాజీ సిఈఓ చెంగవల్లి వెంకట్ సీని నటుడు అశోక్ కుమార్, ఎమ్మెల్యే అవంతి కృష్ణమోహన్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.