ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై చిరంజీవికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

చెన్నయ్‌ :తమిళనాడులోని హోసూరు జ్యుడిషియల్‌ కోర్టు బుధవారంనాడు రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 2011 ఎన్నికల ప్రచారం సమయంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారన్న అభియోగంపై చిరంజీవిపై కేసు నమోదైంది. పరిమితికి మించి వాహనాలు వినియోగించారన్నది అభియోగం. ఈ కేసు విషయమై ఆయన గత నెలలో కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఆయన హాజరు కాకపోవడంతో బుధవారంనాడు హోసూరు కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తూ ఆదేశాలిచ్చింది. అంతేగాక అక్టోబర్‌ 2వ తేదీలోగా కోర్టులో హాజరు కావాలని సూచించింది. ఇదిలా ఉండగా 2011 ఎన్నికల ప్రచారంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి తరఫున ప్రచారం నిర్వహించారు.