ఎమ్మార్పీఎస్ విశ్వరూప మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపిన ఎం జె ఎఫ్ జర్నలిస్టులు.
నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో, జనంసాక్షి :
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తలపెట్టిన విస్వరూప మహా పాదయాత్రకు నాగర్ కర్నూల్ జిల్లా మాదిగ జర్నలిస్టులు సంఘీభావాన్ని తెలియజేశారు.శుక్రవారం విశ్వరూప మహా పాదయాత్రలో భాగంగా ఏడవ రోజు నాగర్ కర్నూల్ జిల్లాకు చేరుకున్నది.ఈ సందర్భంగా మాదిగ జర్నలిస్టులు మంద కృష్ణ మాదిగ కు శాలువగప్పి పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాదిగ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంగిడి చెరువు వెంకటస్వామి మాట్లాడుతూ గత 29 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ అనేక రూపాలలో వర్గీకరణ కై ఉద్యమాలు చేస్తున్నదని పలు రాజకీయ నాయకులు హామీలు ఇస్తున్నారే తప్ప అమలు పరచడం లేదని ఖచ్చితంగా వచ్చే శీతాకాల సమావేశంలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి అమలు చేయాలని కోరారు.ఎస్సీ వర్గీకరణతోనే మాదిగ మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగ గతవారం ఏడవ తేదీన జోగులాంబ జిల్లాలో అలంపూర్ నుంచి ప్రారంభించిన విశ్వరూప మహా పాదయాత్ర వనపర్తి జిల్లా నుండి నాగర్ కర్నూల్ జిల్లాకు ఏడవ రోజు చేరుకున్నది. వర్గీకరణ బిల్లు చట్టసభలో ఆమోదించేంతవరకు మాదిగ జర్నలిస్టులు ఎమ్మార్పీఎస్ కు పూర్తిస్థాయిలో మద్దతు ఉంటుందని అన్నారు.మాదిగలను అన్ని రాజకీయ పార్టీలు నమ్మించే మోసం చేశాయని అన్నారు.వర్గీకరణ సాధించేంతవరకు మాదిగ జర్నలిస్టులు మందకృష్ణ అడుగుజాడల్లో నడుస్తూ పోరాడుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్టులు బంగారయ్య, ప్రకాష్, రాజు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.