ఎమ్మార్ ప్రాపర్టీస్, ఎమ్మార్ ఎంజీఎఫ్‌లపై ఈడీ కొరడా
న్యూఢిల్లీ: ఎమ్మార్ ప్రాపర్టీస్, ఎమ్మార్ ఎంజీఎఫ్‌లపై ఈడీ కొరడా ఝళిపించింది. వీటికి చెందిన రూ. 71 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఢిల్లీలో ఈ సంస్థల విల్లాల అమ్మకాలు, బదిలీల్లో జరిగిన అక్రమాల విచారణలో భాగంగా ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. మనీలాండరింగ్ చట్టం కింద గచ్చిబౌలీలోని బౌల్డర్‌హిల్స్‌కు చెందిన 34 విల్లాల అటాచ్‌మెంట్‌కు కూడా ఈడీ నిర్ణయించింది. అయితే ఆస్తుల అటాచ్‌మెంట్‌పై తమకు ఎలాంటి నోటీసు అందలేదని ఎమ్మార్ ఎంజీఎఫ్ వర్గాలు పేర్కొన్నాయి.



