ఎమ్మెల్యే జోగు రామన్నను పరామర్శించిన మంత్రి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కేటీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్
ఆదిలాబాద్, సెప్టెంబర్ 26: ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న , ఆయన కుటుంబ సభ్యులను పురపాలక, ఐటీ
శాఖ మంత్రి కేటీఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమవారం పరామర్శించారు.
సోమవారం ఉదయం మంత్రులు కేటీఆర్ హైదరాబాద్ నుండి హెలికాఫ్టర్ లో జైనథ్ చేరుకుని, అక్కడి నుంచి రోడ్ మార్గం ద్వారా దీపాయిగూడకు చేరుకున్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఇంటికి వెళ్ళి అయన తల్లి జోగు బోజమ్మ చిత్రపటానికి. మంత్రులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఎమ్మెల్యే జోగు రామన్న, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కేటీఆర్ వెంట ఎమ్మెల్సీ లు దండే విఠల్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కు, తదితరులు ఉన్నారు.