ఎమ్మెల్సీ వర్గానికి భారీ షాక్

బషీరాబాద్ డిసెంబర్ 15,(జనం సాక్షి) బషీరాబాద్ మండలం పరిధిలో గురువారం రోజున మంతట్టి గ్రామంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గం నుండి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వర్గంలోకి భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాము నాయక్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేసే అభివృద్ధిని చూసి పెద్ద ఎత్తున చేరడం జరుగుతుంది రాబోయే రోజుల్లో భారీ మెజారిటీతో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ని భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపు ఖాయమని తెలిపారు. చేరిన వారి వివరాలు మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డీ, మాజీ ఎంపీటీసీ ఎ.శేఖర్, మాజీ ఎంపిటిసి మహేందర్ రెడ్డి,జి.నరసింహారెడ్డి,మోహన్ రెడ్డి,కుర్వ బలప్ప,గోవర్ధన్ రెడ్డి,బసి రెడ్డి,దత్తు,మహేష్,రాజు, అనంతప్ప,ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గంలో చేరారు.ఈ కార్యక్రమంలో మంతట్టి సర్పంచ్ విభూది దశరథ్,పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి,టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇందర్ చేడ్ నర్సిరెడ్డి (రాజు ), మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి.ఆర్ శ్రీనివాస్,పిఎసిఎస్సి డైరెక్టర్ నర్సిరెడ్డి. నవీన్ రెడ్డి,ఉప సర్పంచ్ పరశురాం,ఏఎంసీ డైరెక్టర్ కృష్ణ,విలేజ్ పార్టీ ప్రెసిడెంట్ మక్బూల్ పాషా, మాజీ సర్పంచ్ ఏరుకలీ నర్సిములు, మొగుళప్ప,నర్సిములు, అనంతయ్య,శ్రీనివాస్,మోహన్ సింగ్,కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.