ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు తావులేదు

వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణారావు
శ్రీకాకుళం, ఆగస్టు 3: ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు మురళీకృష్ణారావు హెచ్చరించారు. నరసన్నపేట మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎరువల కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డీలర్లు ఎరువులను ముద్రిత ధరలకే విక్రయించాలని, రైతులు తప్పని సరిగా బిల్లులు పొందాలన్నారు. ఏరోజుకారోజు ఎరువుల విక్రయాపై ఆన్‌లైన్‌లో సమాచారం పొందుపరచాలని జేడీ సూచించారు. అలాగే రికార్డుల నిర్వహణపై కూడా వ్యాపారులు దృష్టి పెట్టాలన్నారు. ఆయనతో పాటు వ్యవసాయశాఖ ఎడిఎ రవీంద్రభారతి, వ్యవసాయాధికార్లు పద్మావతి, ఆర్‌.అప్పారావు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.