ఎర్రగడ్డలో యువకుడి దారుణ హత్య

అమీర్‌పేట్‌ : మీత్రుల మధ్య ఘర్షణ ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసిన ఘటన ఎర్రగడ్డలో చోటుచేసుకుంది. ఈ ఉదయం ఎర్రగడ్డ మజీద్‌లేన్‌లో ఉంటున్న కొందరు  మిత్రులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణ తారాస్థాయికి చేరి ఇమ్రాన్‌ షాకాన్‌ అనే యువకుడు కత్తి పోట్లకు గురయ్యాడు. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి సనత్‌నగర్‌ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.