ఎస్సారెస్పీ కెనాల్ కాల్వ బాధిత రైతులకు అన్యాయం జరుగుతోంది

  దేవరుప్పుల, ఆగస్టు 31 (జనం సాక్షి) :    తెలంగాణ ప్రభుత్వం వివిధ రిజర్వాయర్ ఎస్సారెస్పీ కెనాల్  కాల్వ కోసం రైతుల నుంచి భూములను సేకరిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నూరు రిజర్వాయర్  ఎస్సారెస్పీ కెనాల్ కాలువ కింద పోతున్న రైతులు భూములను  ప్రభుత్వానికి ఇవ్వడానికి రైతులు ప్రభుత్వంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై గ్రేటర్ వరంగల్ ఎల్ హెచ్ పి ఎస్ అధ్యక్షులు ధారవత్  బాలు నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. చెన్నూరు ఎస్సారెస్పీ కెనాల్  కోసం సేకరించిన  బోడోనికుంటా తండా,దేవరుప్పుల  గ్రామ రైతుల పలు సర్వే నెంబర్లు గల  భూముల తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ రైతులును అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు .ఇదే రైతు ప్రభుత్వం భూములు కొనాలంటే ఎకరానికి కోట్లల్లో అమ్ముతుంటే, రైతుల భూములు మాత్రం ఎకరానికి లక్షల్లో కొంటారా ?అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు .కెనాల్ కాల్వ బాధిత రైతులకు ఎస్ఆర్ఎస్పీ అధికారులు ఎస్సారెస్పీ కాలువ కోసం మీ భూమి ప్రభుత్వానికి ఇస్తున్నట్లు సంతకం చేయాలని స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవో నుంచి రైతులకు నోటీసులు అందాయి కెనాల్ బాధితులు రైతులను ఆర్డిఓ కార్యాలయానికి వెళ్లగా అక్కడ అధికారులు చెప్పిన మాటకు రైతులు షాక్ తిన్నారు.మీ భూములకు లక్షల్లో నష్టపరిహారం ఉంటుందని అధికారులు చెప్పగా రైతులు షాక్ తిన్నారు.  ఒక  రైతుకు  రెండు ఎకరాల లోపే ఉంది ఆ ఉన్న రెండు ఎకరాలు పోతే మా పిల్లలు మేము ఏడా బ్రతకాలి అంటూ అధికారులపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు .ఇదే మా భూములను లక్షలు పెట్టి కొనే బదులు మా భూములు ఎంత అయితే కెనాల్ కాలువ కోసం పోతుందో అదే భూమికి బదులు భూములు ఇవ్వాలంటూ పక్కన లక్షలు పెట్టి వేరే చోట మాకు భూములకు కొనివ్వాలంటూ రైతులు అధికారులను కోరారు.రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదంటూ రైతులకు న్యాయం జరిగేంతవరకు పోరాడతామని బాలు హెచ్చరించారు.