నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి

 

 

 

 

 

 

 

 

 

గంభీరావుపేట డిసెంబర్ 30 (జనం సాక్షి):

_ఎస్సై అనిల్ కుమార్..

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముందస్తు మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎస్సై అనిల్ కుమార్ తెలుపుతూ నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కొన్ని సూచనలు చేశారు డిసెంబర్ 31 న్యూ ఇయర్ జిల్లా వ్యాప్తంగా డీ జే లు నిషేధం నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని , మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరమని వేగంగా నడుపుతే కేసులు నమోదు చేస్తామని జైలు శిక్ష విధించబడును ఇల్లు ప్రైవేట్ ఆస్తులపై వీధిదీపాలపై రాళ్లు వేయడం అద్దాలు పగలగొట్టడం మహిళలపై ఇబ్బంది పెట్టిన అసభ్యంగా ప్రవర్తించిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని , బైక్ రేసింగ్ త్రిబుల్ రైడింగ్ నడిపితే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు న్యూ ఇయర్ వేడుకల్లో నిషేధిక డ్రగ్స్ గంజాయి వంటి మత్తుప్రదార్థాలు విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని మద్యం దుకాణాలు నిర్ణీత సమయంలో బందు చేయాలని మైనార్లు మద్యం అమ్మ కూడదని సూచించారు బహిరంగ ప్రదేశాలు ప్రభుత్వ స్థలాల్లో మద్యం విక్రయిస్తే కేసులు చేస్తామని మైనర్ వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ఇవన్నీ ఉల్లంగించినట్టుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే 100 నెంబర్కు సమాచారం ఇవ్వాలని తక్షణమే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు, నూతన సంవత్సర వేడుకలు కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.