తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047 లక్ష్య సాధన దిశగా..

కొత్త ఏడాదిలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతాం
` రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిరాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047 లక్ష్య సాధన దిశగా ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులతో పాటు మహిళలు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని గుర్తు చేశారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబం తాము ఆశించిన ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, ప్రజలందరూ ఆనందంతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.