పోలీసులు విధుల పట్ల అలసత్వం వహించవద్దు
చెన్నారావుపే
ట, డిసెంబర్ 30 (జనం సాక్షి):
నర్సంపేట ఏసిపి రవీందర్ రెడ్డి…
చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ..
పోలీసులు విధుల పట్ల ఎవరు అలసత్వం వహించవద్దని నర్సంపేట ఏసిపి రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని రికార్డులు, గదులు, చుట్టూ పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని వెంటనే వారి వద్ద నుండి ఫిర్యాదులను తీసుకొని కేసులు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు విధుల పట్ల అలసత్వం వహించకుండా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ సేవలను అందించాలన్నారు. కేసులు పెండింగ్ లో లేకుండా ఎప్పటి కేసులు అప్పుడు పరిష్కరిస్తూ ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించాలన్నారు. డయల్ 100 కు ఫోన్ రాగానే పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి వీలైనంత త్వరగా సంఘటన స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించాలన్నారు. మండల పరిధిలోని గ్రామాలలో ఎలాంటి నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడాలని సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నెక్కొండ సీఐ శ్రీనివాస్, చెన్నారావుపేట ఎస్సై రాజేష్ రెడ్డి, ఏఎస్ఐ లక్ష్మణమూర్తి, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



