ఇస్రో మరో ముందడుగు

ఎస్‌ఎస్‌ఎల్వీ మూడో స్టేజ్‌ పరీక్ష విజయవంతం
నెల్లూరు(జనంసాక్షి):భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ముందడుగు వేసింది. స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ూూఒప) మూడో దశ (ూూ3)ను విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (ూఆూఅ)లోని సాలిడ్‌ మోటార్‌ స్టాటిక్‌ టెస్ట్‌ కేంద్రంలో మంగళవారం ఈ ప్రయోగం నిర్వహించింది. మూడు`దశల ఆల్‌`సాలిడ్‌ లాంచ్‌ వెహికల్‌ ఎస్‌ఎస్‌ఎల్వీ పనితీరును విశ్లేషించడంతోపాటు డేటాను సేకరించినట్లు ఇస్రో వెల్లడిరచింది. అంతరిక్షంలోకి చిన్న ఉపగ్రహాలను వేగంగా ప్రయోగించడం కోసం దీనిని రూపొందించారు. అధిక స్థాయిలో ఉత్పత్తికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. పేలోడ్‌కు సెకనుకు 4 కి.విూ వేగాన్ని అందించడంలో ఎస్‌ఎస్‌`3 కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు వెల్లడిరచారు. పేలోడ్‌ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు. ప్రస్తుతం చేసిన అప్‌గ్రేడ్‌లు ఈ దశలో మెరుగైన ఇగ్నైటర్‌, నాజిల్‌ డిజైన్‌ ఉపగ్రహాల సామర్థ్యం, నిర్మాణాత్మక దృఢత్వాన్ని పెంచినట్లు తెలిపారు. ఈ పరీక్షలో ఒత్తిడి, థ్రస్ట్‌, ఉష్ణోగ్రత, వైబ్రేషన్‌, యాక్యుయేటర్‌ పనితీరు వంటి విషయాలను పరిశీలించినట్లు తెలిపారు.

ప్రళయ్‌ టెస్ట్‌ విజయవంతం
చాందీపూర్‌(జనంసాక్షి):అత్యాధునిక టెక్నాలజీతో డీఆర్‌డీఓ రూపొందించిన రెండు ప్రళయ్‌ క్షిపణుల టెస్ట్‌`ఫైర్‌ విజయవంతమైనట్టు రక్షణ శాఖ బుధవారంనాడు తెలిపింది. ఒడిశా చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి ఉదయం 10.30 గంటలకు ఈ మిసైళ్లను ప్రయోగించారు. ఒకే లాంఛర్‌ నుంచి వరుసగా వీటిని ప్రయోగించినట్టు రక్షణ శాఖ తెలిపింది. రక్షణ శాఖకు చెందిన పరిశోధన, అభివృద్ధి సంస్థ ఈ క్షిపణని అభివృద్ధి చేసింది. ఆపరేషనల్‌ కండిషన్ల కింద యూజర్‌ ఎవల్యూషన్‌ ట్రయిల్స్‌లో భాగంగా ప్రళయ్‌ క్షిపణులను ప్రయోగించినట్టు డీఆర్‌డీఓ ఓ ప్రకటనలో తెలిపింది. రెండు క్షిపణలు నిర్దేశిత మార్గంలో వెళ్లి లక్ష్యాలను చేరుకున్నట్టు పేర్కొంది. మిసైల్‌ ల్‌ట్‌ తుది దశ వెరిఫికేషన్‌ కూడా విజయవంతమైందని చెప్పింది.