ముస్తఫా నగర్ లో రేపటినుండి హజరత్ మీరా శే ఖాద్రి హలై దర్గా ఉర్సు ఉత్సవాలు

 

 

 

 

గంభీరావుపేట డిసెంబర్ 30 (జనం సాక్షి)

చుట్టుపక్క జిల్లా నుండి ప్రజలు హాజరు..

గంభీరావుపేట మండలంలోని ముస్తఫా నగర్ గ్రామంలో దర్గా ఉరుసు ఉత్సవాలు రేపటినుండి మొదలవుతాయని దర్గా పూజారి అబ్దుల్ రహీం అండ్ బ్రదర్స్ తెలియజేశారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి అమిద్ దర్శించుకుని వారు మాట్లాడుతూ31
రోజున మధ్యాహ్నం 4 గంటలకు అబ్దుల్ రహీం అండ్ బ్రదర్స్ పూజారి ఇంటి నుండి గంధం వీధుల గుండా ఊరేగింపుతో దర్గా వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అన్నారు అనంతరం జనవరి ఒకటి1 రోజున ఉర్సు ఉత్సవాలు వివిధ జిల్లాల కరీంనగర్ కామారెడ్డి నిజాంబాద్ హైదరాబాద్ మెదక్ సిద్దిపేట సిరిసిల్ల. పరిసర ప్రాంతాల నుండి మండలాల నుండి భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం దాతల సహకారంతోనిర్వాహకులు పూజారి అబ్దుల్ రహీం అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు.