క్లీన్‌సిటీగా హైదరాబాద్‌

` పరిశుభ్రం, పచ్చదనంపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక శ్రద్ధ
పరిశుభ్రతలో హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం
` రూ.3వేల కోట్ల ఆస్తి పన్ను వసూలే లక్ష్యం: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): పరిశుభ్రతలో హైదరాబాద్‌ మహానగరాన్ని అగ్ర స్థానంలో నిలపడమే లక్ష్యంగా 2026లో పనిచేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. 2025 స్వచ్చ సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయిలో జీహెచ్‌ఎంసీ ఆరో ర్యాంకు సాధించిందన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 650 చదరపు కిలోవిూటర్ల నుంచి దాదాపు 2 వేల కిలోవిూటర్ల వరకు పరిధి విస్తరించిన క్రమంలో 300 వార్డుల నుంచి రోజుకు 9 వేల మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందన్నారు.చెత్త నిర్వహణకు కొత్త డంపింగ్‌ యార్డుల కోసం భూసేకరణ చేస్తున్నట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు పారిశుద్ధ్యంపై 300 వార్డుల్లో నిరంతరం ప్రత్యేక డ్రైవ్‌ కొనసాగిస్తామని వివరించారు. గ్రేటర్‌లో పారిశుద్ధ్యం సహా వివిధ అభివృద్ధి పనులు, పరిపాలన అంశాలపై సమగ్ర వివరాలు వెల్లడిరచిన ఆర్వీ కర్ణన్‌…. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.3వేల కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జీఐఎస్‌ సర్వే ద్వారా 14 లక్షల ప్రాపర్టీలను సర్వే చేసినట్లు పేర్కొన్నారు. అందులో లక్ష మంది.. కట్టాల్సిన ఆస్తి పన్ను కంటే తక్కువగా చెల్లిస్తున్నట్టు గుర్తించామన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే నగర పౌరులు తమ ఆస్తి పన్ను నేరుగా జీహెచ్‌ఎంసీ వెబ్‌ సైట్‌, యాప్‌ ద్వారా చెల్లించవచ్చని సూచించారు. నగరంలో రవాణా సదుపాయం మరింత మెరుగుపర్చేందుకు పెండిరగ్‌ లో ఉన్న ప్లైఓవర్లను ఏప్రిల్‌ నాటికి పూర్తి చేస్తామని, హెచ్‌ సీటీ ప్రాజెక్టు కింద చేపట్టిన 32 ప్రాజెక్టులకు త్వరలోనే ప్రారంభిస్తామని ఆర్వీ కర్ణన్‌ ప్రకటించారు.

ఇటీవల మోకాలి శస్త్ర చికిత్స అనంతరం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. బుధవారం ఆయన నివాసానికి వెళ్లి ఆయన బాగోగులు తెలుసుకున్నారు