ఇండియా`పాక్ యుద్ధం ఆపింది మేమే..
` ఇరు దేశాల మధ్య వర్తిత్వం వహించాం
` చైనా సంచలన ప్రకటన
బీజింగ్(జనంసాక్షి):ఆపరేషన్ సిందూర్‌తో భారత్‌కు వచ్చిన గుర్తింపును జీర్ణించుకోలేకో ఏమో తెలియదు గానీ ట్రంప్ తరచుగా భారత్`పాక్ యుద్ధాన్ని తానే ఆపానని వ్యాఖ్యానిస్తూ వచ్చారు.ఈ విషయంపై భారత్ ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ట్రంప్ మామ తన తీరు మార్చుకోవడం లేదు. నిన్న ఇజ్రాయెల్ ప్రధానితో జరిగిన భేటీలో కూడా ఈ వ్యాఖ్యలే చేశారు.ఇది చాలదన్నట్లు తాజా ఆజాబితాలో చైనా దేశం కూడా చేరింది.ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత్‌కు తంటాలు తప్పడం లేదు. ఇండియన్ ఆర్మీ ముష్కరుల స్థావరాల్ని వారి స్వస్థలంలోనే ధ్వంసం చేసి ప్రపంచానికి తన సత్తా ఏంటో తెలిసేలా చేసింది. తన జోలికస్తే రిప్లై ఏలా ఉంటుందో చిన్న ట్రైలర్ చూపించింది. దీంతో భారత్‌తో పెట్టుకుంటే ఏమవుతుందో అర్థమైన పాక్ దారికొచ్చింది. ఇరు దేశాలు పరస్పర కాల్పులు విరమణ ఒప్పందంపై సంతకం పెట్టాయి. తాజాగా చైనా ఈ అంశంలో వేలు పెట్టింది. భారత్`పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించి తానే ఈ యుద్ధాన్ని ఆపానని డ్రాగన్ కంట్రీ ప్రకటించింది .ఆ దేశ విదేశాంగ మంత్రి వాంఫ్‌ు యీ మాట్లాడుతూ ‘‘ చైనా చాలా దేశాల మధ్య వివాదాల్ని పరిష్కరించింది. మయన్మార్‌లో సందిగ్ధతలు, ఇరాన్ న్యూక్లియర్ సమస్య, భారత్` పాకిస్థాన్ సమస్య, కంబోడియా`థాయిలాండ్ వివాదం, పాలస్తీనా`ఇజ్రాయిల్ మధ్య గొడవ ఇలా ప్రపంచ దేశాల మధ్య గొడవలన మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించాం’’ అని చైనా విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు.అయితే ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ‘‘ మేము ఇదివరకే ఇటువంటి వ్యాఖ్యలను ఖండిరచాం. భారత్`పాకిస్థాన్ అంశంలో మూడవ పార్టీ జ్యోక్యం లేదు. మా ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం రెండు దేశాల మధ్యలోనే జరిగిందని’’ భారత్ హెచ్చరించింది. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాక్‌కు మద్ధతుగా నిలిచింది. పాక్‌కు అవసరమైన యుద్ధ సామాగ్రిని, ఫైటర్ జెట్స్ అందించింది. ఆసమయంలో భారత్ చేసిన దాడులలో డ్రాగన్ కంట్రీకి చెందిన కొన్ని వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.
చైనా వ్యాఖ్యలు నిజం కాదు
` డ్రాగన్ ప్రకటనను తోసిపుచ్చిన కేంద్రం
న్యూఢల్లీి(జనంసాక్షి):భారత్`పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను తామే చల్లార్చామంటూ చైనా చేసిన ప్రకటనపై భారత్ స్పందించింది. అయితే చైనాకు అంత సీన్ లేదని భారత్ అంటోంది.మధ్యవర్తిత్వం విషయంలో భారత్ ఎప్పుడూ ఒకేరకమైన విధానాన్ని అనుసరిస్తుందని స్పష్టం చేస్తూ.. డ్రాగన్ కంట్రీ ప్రకటనను తోసిపుచ్చింది.చైనా ప్రకటనను కేంద్ర వర్గాలు తోసిపుచ్చినట్లు ఓ జాతీయ విూడియా సంస్థ కథనం ఇచ్చింది. ఆ కథనం ప్రకారం.. భారతదేశం మధ్యవర్తిత్వంపై ఎప్పటినుంచో స్పష్టమైన వైఖరిని అవలంభిసతోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో.. ఆ తర్వాత ఎలాంటి మధ్యవర్తిత్వం జరగలేదు. కేవలం పాకిస్తాన్ భారత్‌ను సంప్రదించి కాల్పుల విరమణ కోరింది. కాబట్టి.. భారత్ ఎప్పటికీ మూడోపక్ష జోక్యాన్ని అనుమతించదు అని పేర్కొన్నాయి.పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను భారత వైమానిక దళం ఆపరేషన్ సిందూర్ పేరిట సర్జికల్ స్ట్రయిక్సతో సర్వనాశనం చేసింది. ఈ నేపథ్యంతో మే 7`10వ తేదీల మధ్య ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. రెండు దేశాల సైనిక డీజీఎంవోల సంప్రదింపుల ఫలితంగా సడలిపోయాయని మోదీ సర్కారు ప్రకటించింది. కానీ,తాజాగా బీజింగ్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు వివాదాలను పరిష్కరించడంలో చైనా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. మయన్మార్, ఇరాన్ అణు సమస్యలతో పాటు భారత్`పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను కూడా చైనా తన మధ్యవర్తిత్వం ద్వారా తగ్గించిందని ఆయన వెల్లడిరచారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన టారిఫ్ బెదిరింపులతోనే ఇరు దేశాలు దిగొచ్చి కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించుకుంటూ వస్తున్నారు. అంతేకాదు.. దీనికి కారకుడంటూ భారతీయ మూలాలున్న తన ప్రత్యేక సహాయకుడు రికీ గిల్‌ను ట్రంప్ ప్రభుత్వం తాజాగా సత్కరించింది కూడా. ఈ పరిణామాల నడుమే.. మే నెల ఉద్రిక్తతల సమయంలో పాక్‌కు ఆయుధాలను సరఫరా చేసిన చైనా ఇప్పుడు మధ్యవర్తిత్వం నడిపి ఉద్రిక్తతలను చల్లార్చామంటూ ప్రకటించుకోవడం కొసమెరుపు.


