ఎస్సీ వసతి గృహంలో వైద్యశిబిరం

నాగిరెడ్డిపేట: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో స్థానిక పీహెచ్‌సీ వైద్యుడు నాగయ్య విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 92మందికి పరీక్షలు నిర్వహించగా 42 మందికి చికిత్సలు చేశారు.