ఏదీ చేయూత

మేడిపల్లి: మండలంలో జనశక్తి పీపుల్స్‌ వార్‌ నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. అప్పట్లో నక్సలైట్ల చేతిలో 15మంది చనిపోగా, పోలీసుల ఎన్‌కౌంటర్లలో 10మంది వరకు నక్సలైట్లు మృతి చెందారు. మండలంలోని గోవిందారం, మోత్కురావుపేట, పసునూరు, రాజలింగంపేట, రాగోజిపేట, ఒడ్డాడు, బీమారం, కొండాపూర్‌, మన్నెగూడెం, లింగంపేట తదితర గ్రామాల్లో నక్సలైట్ల ఉనికి ఎక్కువగా ఉండేంది. 2002లో జిల్లాలో 46మంది జనశక్తి నక్సలైట్లు అప్పటి ఎస్పీ ప్రవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో లింగిపోగా అందులో 11మంది మేడిపల్లి మండలానికి చెందిన వారున్నారు. అయినా ప్రభుత్వం నక్సల్స్‌ ప్రభావిత గ్రామాల అభివృద్ధి కింద మేడిపల్లి మండలంపై దయ చూపలేదు. జిల్లాకు మంజూరైన నిధుల్లోంచి మండలానికి ఒక్క పైసా విదల్చలేదు.