ప్రజలకు పనికొస్తేనే మీ ఉద్యోగానికి సార్ధకత


` పదిరోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించండి
` ప్రజాపాలన ప్రగతిపై మార్చ్‌ఫాస్ట్
` మార్చి 6 నుంచి 12 వరకు
` ఐదు దశల్లో 99 రోజుల యాక్షన్‌ప్లాన్
` ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేయాలి
` విద్యావ్యవస్థలో మార్పులపై ప్రజలకు అవగాహన
` మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు సకాలంలో బిల్లుల చెల్లింపు
` గ్రామస్థాయి నుంచి ప్రజాప్రతినిధుల భగస్వామ్యం ఉండాలి
` కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు
హైదరాబాద్(జనంసాక్షి): ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుంది క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కలెక్టర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ఎప్పటికీ విÖకు ప్రజల సమస్యలు అర్థం కావు కనీసం నెలకు 10 రోజులైనా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే..కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలని ఆదేశించారు.రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై లబ్దిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సచివాలయంలో కలెక్టర్లతో సీఎం సమావేశమయ్యారు. ప్రజా పాలన` ప్రగతి ప్రణాళికపై కలెక్టర్లకు దిశా నిర్దేశర చేశారు. 99 రోజుల కార్యాచరణలో అందరి భాగస్వామ్యం ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలి. విద్యావ్యవస్థలో తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ ఆస్పత్రులను మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేయాలి. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతినెలా బిల్లులు చెల్లించాలని సీఎం అన్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అధికారులు, కలెక్టర్లకు పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాధాన్యత అంశాలు, పాలనాపరమైన సంస్కరణలపై ఈ సందర్భంగా చర్చించారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.మరోవైపు పలువురు కలెక్టర్లపై సీఎం సీరియస్ అయ్యారు. కొంత మంది కలెక్టర్లు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండటం లేదన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. అలాంటి వారు తమ పని తీరు మార్చుకోవాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 99 రోజుల పాటు జిల్లా విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. ఈ గడువులోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలనను పరుగులు పెట్టించాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశర చేశారు. 99రోజుల పాటు జిల్లాను విడిచి వెళ్లొద్దని సీఎం ఆదేశించారు. రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు.. సీఎస్ కె.రామకష్ణారావు అనుమతి లేకుండా హైదరాబాద్ వస్తున్నారన్నారు. అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో వేగం పెంచే లక్ష్యంతో ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన` ప్రగతి ప్రణాళిక పేరుతో 99 డేస్ యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతోందన్నారు. జిల్లాల్లో బాగా పని చేసిన కలెక్టర్లకు సీఎం గ్రేడింగ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా విÖటింగ్‌లో పనితీరు ఆధారంగా కలెక్టర్లకు సీఎం గ్రేడింగ్ ఇవ్వనున్నారని ఆశించిన మేరకు పని తీరు చూపని కలెక్టర్లకు దిశానిర్దేశర చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు. ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన`ప్రగతి ప్రణాళికను నిర్వహిస్తుంది. అయిదు దశల్లో 99 రోజుల పాటు జరిగే కార్యక్రమానికి నోడల్ శాఖ గా వ్యవహరిస్తున్న ప్రణాళిక శాఖ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ ,ఏప్రిల్ 16న మండల స్థాయిలో , మే 2న నియోజకవర్గ స్థాయి , మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయని ఆ శాఖ వెల్లడించింది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక నిర్వహించనున్నట్లు తెలిపింది. 10 వివిధ థీమ్‌లతో శాఖల వారీగా 99 రోజుల కార్యక్రమం ఉంటుందని వివరించింది. మొదటి థీమ్‌లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్ , రెండవ థీమ్‌లో ఆరోగ్యం 3లో అరైవ్.. అలైవ్, 4లో సంక్షేమం , 5లో పిల్లల భద్రత.. డ్రగ్స్ కు అడ్డుకట్ట, 6లో రైతు సంక్షేమం.. వ్యవసాయంపై కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 7లో విద్య, 8లో యువత.. క్రీడలు, 9లో మహిళలు , 10వ థీమ్‌లో పర్యావరణంపై సమావేశాలు జరుగుతాయని తెలిపారు. మార్చి 6న అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు , 99 రోజుల్లో శాఖల వారీగా ప్రభుత్వం చేపడుతున్న అభివద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలుంటాయని వివరించింది. ప్రజా పాలన`ప్రగతి ప్రణాళిక కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను తయారు చేశామని వెల్లడించింది .

తాజావార్తలు