వేసవి డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ప్రణాళిక


` ఒక్కరోజే 18,139 మెగావాట్ల డిమాండ్
` డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి
హైదరాబాద్(జనంసాక్షి): మంగళవారం ఒక్కరోజే 18,139 మెగావాట్ల డిమాండ్‌ను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్‌ను నమోదు చేసుకుందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వేసవి కాలం నేపథ్యంలో విద్యుత్ వినియోగం గరిష్ఠంగా ఉంటుందని.. అందుకు తగిన అవసరాల కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. కోతలు లేకుండా.. ఎటువంటి అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్థలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. పెద్ద రాష్టాల్రతో సమానంగా తెలంగాణ రికార్డు సష్టించిందని వివరించారు. ఉదయం 8.00 గంటలకే నింగిలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నానానికి సూర్యుడు నిప్ప్పులు చెరుగుతున్నాడు. దీంతో ఇళ్లలోనే ప్రజలు ఉండి పోతున్నారు. ఏసీలు, ఫ్రిజ్‌లు ఆన్ చేసి.. ఉంచుతున్నారు. దాంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది.
విద్యుత్ వినియోగంలో అరుదైన మైలురాయి
వేసవి మొదలై అప్ప్పుడే ఎండలు ముదురుతున్నాయి. గత మూడు రోజులుగా ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం విద్యుత్ వినియోగంలో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. మార్చి 3వ తేదీ మంగళవారం ఉదయం 11:01 గంటలకు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. వేసవి కాలం ఇప్ప్పుడిప్ప్పుడే ప్రారంభమవుతున్న తరుణంలో, ఇంతటి భారీ స్థాయిలో విద్యుత్ అవసరం ఏర్పడినప్పటికీ, ఎక్కడా చిన్నపాటి అంతరాయం కూడా లేకుండా సరఫరాను కొనసాగించి రాష్ట్ర విద్యుత్ సంస్థలు తమ సమర్థతను చాటుకున్నాయి. గతేడాది మార్చిలో నమోదైన 15,623 మెగావాట్ల రికార్డును, అలాగే గత నెలలో నమోదైన గణాంకాలను ఈ కొత్త రికార్డు వెనక్కి నెట్టేసింది. రాష్ట్రంలో పారిశ్రామికాభి వద్ధి, ఐటీ రంగ విస్తరణతో పాటు ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయానికి అందిస్తున్న నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా ఈ భారీ డిమాండ్‌కు ప్రధాన కారణాలని అధికారులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా సాగునీటి అవసరాల కోసం రైతాంగం మోటార్లను పెద్ద ఎత్తున వినియోగిస్తుండటం, పట్టణ ప్రాంతాల్లో ఏసీల వాడకం పెరగడం వంటి అంశాలు విద్యుత్ వినియోగాన్ని గరిష్ట స్థాయికి చేర్చాయి. భౌగోళికంగా చిన్న రాష్ట్రమైనప్పటికీ, విద్యుత్ డిమాండ్ విషయంలో తెలంగాణ ఇప్ప్పుడు రాజస్థాన్ , మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్టాలతో పోటీ పడుతోంది. పంజాబ్, హర్యానా వంటి పారిశ్రామిక రాష్టాల్ర కంటే తెలంగాణలో డిమాండ్ ఎక్కువగా ఉండటం ఇక్కడి ఆర్థిక పురోగతికి నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చారిత్రాత్మక ఘనతపై ఉప ముఖ్యమంత్రి , ఇంధనశాఖ మంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయి డిమాండ్‌ను సమర్థవంతంగా హ్యాండిల్ చేసిన ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులను , సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రం ఎంతటి భారీ డిమాండ్‌నైనా తట్టుకునేలా సబ్`స్టేషన్ల పటిష్ఠత, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వంటి ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. రానున్న ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ డిమాండ్ 19,000 మెగావాట్లను దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, దానికి తగినట్లుగా ’సమ్మర్ యాక్షన్ ప్లాన’తో ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.

 

తాజావార్తలు