ఏసీబి వలలో ఆర్‌ఐ, విఆర్‌వో…

సీజ్‌ చేసిన గ్యాస్‌ సిలిండర్‌లను విడుదల చేసేందుకు గ్యాస్‌ఏజన్సీ వద్ద నుండి లంచం తీసుకుంటూ కరీంనగర్‌ జిల్లాకు చెందిన కాల్వశ్రీరాంపూర్‌ ఆర్‌ఐ తిరుపతి, మల్యాల విఆర్‌వో రమేశ్‌లు ఏసీబి వలలో చిక్కారు. సుమారు నెల క్రితం గ్యాస్‌ ఏజన్సీకి చెందిన సిలిండర్‌లను సీజ్‌ చేయగా వాటిని విడుదల చేయాలంటూ జేసీ ఆదేశాలు ఇచ్చారు. అయితే దానికి రూ.15000 చెల్లించాలంటూ ఆర్‌ఐ, విఆర్‌వో డిమాండ్‌ చేయగా గ్యాస్‌ఏజన్సీ డెలివరీ బాయ్‌ సదానందం ఏసీబీని ఆశ్రయించారు. దీంతో లంచం తీసుకుంటుండగా ఏసీబీ వీరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొంది.