ఏసీబీ అంటే యాంటీ చంద్రబాబు బ్యూరోనా:నర్శిరెడ్డి…

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి కేసులో మే30న స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి ఉంటే…జూన్‌ 1న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు పేర్కొనలేదని టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఏసీబీ అంటే యాంటీ చంద్రబాబు బ్యూరోనా అని ధ్వజమెత్తారు. విజయశాంతి ఇంట్లో డబ్బులు చేతులు మారిన వ్యవహారంలో హరీష్‌రావు సీబీఐ విచారణ జరిపించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ 63 మంది ఎమ్మెల్యేలు 85 మందికి ఎలా వచ్చారని నర్సిరెడ్డి నిలదీశారు.