ఐకమత్యంతోనే.. సామాజిక ప్రగతి…

గోదావరిఖని, జులై 27 (జనంసాక్షి) : ఐక్యమత్యంతో సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని పెద్దపల్లి ఎంపీ వివేకానంద అన్నారు. శుక్రవారం స్థానిక పాత మున్సిపల్‌ కార్యాలయ సమీపంలోని జామ మజీద్‌లో జరిగిన ‘ఇఫ్తార్‌’ విందుకు ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమత భేదం లేకుండా అన్ని పక్షాలు సామరస్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. హిందు, ముస్లింలు ఐక్యతతో సామాజిక ఉన్నతికి పాటుపడాలన్నారు. అనంతరం జరిగిన ఇఫ్తార్‌ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబర్‌ సలీంపాష, పి.మల్లికార్జున్‌, రెవెళ్లి రాజారాం, కాల్వ లింగస్వామి, కోట రవి, పెద్దెల్లి ప్రకాష్‌, ఎస్‌.నర్సింహారెడ్డి, జంగంపల్లి పోశం, ఆరె దేవకరుణ, గుంపుల లక్ష్మి, గాదం విజయ, వహీద్‌బేగ్‌, మజీద్‌ కమిటీ అధ్యక్షులు మహ్మద్‌ సర్వర్‌ హుస్సేన్‌, బాధ్యులు షేక్‌ హజిఅలీ, జాకీర్‌హుస్సేన్‌, ముస్తాఫా, మహ్మద్‌ షరీఫ్‌, గాజుద్దీన్‌, ఫసియోద్దీన్‌, అన్వర్‌హుస్సేన్‌, హబీబ్‌, ఉస్మాన్‌, నహీం, గౌస్‌, అక్రం, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.