ఐటీడీఏలో అవినీతి పై విచారణ జరపాలి

కొత్తగూడ, మే 24 (జనంసాక్షి):

ఐటీడీఏలో జరుగుతున్న అవినీతిపై వెంటనే విచారణ జరిపించాలని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి బూర్క యాదగిరి డిమాండ్‌ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు అందించాల్సిన సబ్సీడీ విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు సకాలంలో అందించకుండా బినామి పేరుతో కోట్లు దండుకుంటున్నామన్నారు. గిరిజనులకు ఇవ్వాల్సిన హక్కు పత్రాల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారన్నారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ నందు ఎమ్మార్పీలు సక్రమంగా విధులు నిర్వహిస్తలేరన్నారు. ఐటీడీఏ అధికారులు తమకు అనుకూలంగా ఉన్న వారినే ఎమ్మార్పీలుగా నియమిస్తున్నారన్నారు. హక్కు పత్రాలపై అవగాహన సదస్సులు నిర్వహించకుండా నిర్వహిస్తున్నట్లు డబ్బులు డ్రా చేసుకుంటున్నారన్నారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా ఐటీడీిఎలోజరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనుబాబు, రవి, యుగేందర్‌,భాస్కర్‌,వెంకటేశ్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.