ఒక గోల్‌తో టోర్నీనుంచి నిష్క్రమించిన రష్యా

యూరోకప్‌లో హోరాహోరీగా సాగిన గ్రూప్‌-ఎ లీగ్‌ సమరం ముగిసింది నాకౌట్‌ రేసులో మిగిలే జట్లు ఏవనే ఉత్కంటకు తెరపడింది ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాలలో నిలిచిన చెక్‌ రిపబ్లిక్‌ (6),గ్రీస్‌(4) కార్టర్స్‌ బెర్త్‌లు సొంతం చేసుకున్నాయి.కాగా ఇదే గ్రూప్‌లోని రష్యా (4), ఆతిద్య పోలెండ్‌ (2),టోర్నీనుంచి నిష్క్రమించాయి రష్యా, గ్రీస్‌, సమాన పాయింట్లు సాదించినప్పటికి ముఖాముఖి పోరులో 1-0,రికార్డు ఉన్న గ్రీస్‌ అర్హత సంపాదించింది శనివారం రాత్రి జరిగిన చివరి లీగ్‌లో ఒకేఒక గోల్‌తో అటుగ్రూప్‌ ఫేవరేట్‌ రష్యాను ఇంటికి పంపడంతో పాటు నాకౌట్‌కు అర్హత సాదించారు విరామానికి రెండు నిమిషాలు ముందు గ్రీస్‌ ఆటగాడు కరగోనీస్‌ ఏకైక గోల్‌ నమోదు చేశాడు ద్వితీయార్థంలో ఇరుజట్లు గోల్‌ చేయలేకపోయాయి దీనితో గ్రీస్‌ విజయం పరిపూర్ణమయింది ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు 4వేల మంది గ్రీస్‌ అబిమానులు విచ్చేయగా రష్యా అబిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు రష్యా ఓటమితో వారు నిరాశతో వెనుదిరిగారు.లీగ్‌ దశలో గ్రీస్‌ ఒక్కోవిజయం డ్రా,ఓటమి నమోదుచేసింది ఈ గ్రూప్‌లో అత్యధిక పాయింట్ల(4)తో బరిలోకి దిగిన రష్యా ఈమ్యాచ్‌లో కనీసం డ్రా చేసుకున్న నాకౌట్‌ చేరుకునేది కాని పేలవ ఆటతీరుతో బారీమూల్యం చెల్లించుకుంది గ్రీస్‌ ఇప్పటిదాక ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక డ్రా, ఒక ఓటమితో ఉంది చివరిలీగ్‌ మ్యాచ్‌లో రష్యాపై గెలుపే ఈజట్టుకు అదృష్టంగా మారింది అయితే రష్యన్‌ బాక్స్‌లోకి డైవ్‌ చేసినందుకు కరాగునిస్‌ బుక్‌ కావడంతో క్వార్టర్స్‌కు దూరం కానున్నాడు.