గుది‘బండ’

` దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లకు కొరత
` హోటల్,పరిశ్రమలకు గ్యాస్ సరఫరా నిలిపివేస్తూ కేంద్రం ఆదేశాలు
` ఇప్పటికే మూతపడ్డ 20శాతం హోటళ్లు
` గ్యాస్ దొరకకపోతే మూసివేత తప్పదన్న యాజమాన్యాలు
` ఇరాన్ యుద్ద ప్రభావంతో నిత్యావసరాలపైనా మోత
` ఇప్పటికిప్ప్పుడు ప్రమాదం లేదని వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ(జనంసాక్షి):పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్, ఎరువుల దిగుమతులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా ఎల్పీజీ కొరత ఏర్పడింది. గ్యాస్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరను భారీగా పెంచేశాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లతో పాటు డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర పెరిగింది. డొమస్టిక్ సిలిండర్లపై 60 రూపాయలు.. కమర్షియల్ సిలిండర్లపై 115 రూపాయలు పెరిగింది. అంతేకాదు.. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా నిలిచిపోయింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవటంతో బెంగళూరు, చెన్నై, ముంబైలలోని హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నగరాల్లోని దాదాపు 20 శాతం హోటళ్లు మూతపడ్డాయి. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా ముంబయి లో 20శాతం హోటళ్లు, రెస్టారంట్లు మూతపడ్డాయని హెటల్ హోటల్ అండ్ రెస్టారంట్ అసోసియేషన్ మంగళవారం వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రెండు రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూతపడతాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. ’ది బెంగళూరు హోటల్స్ అసోసియేషన’ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో.. ’గ్యాస్ సరఫరా నిలిచిపోవటంతో.. హోటల్స్ మూతపడనున్నాయి. భోజనం కోసం హోటల్స్‌పై ఆధారపడిన సాధారణ ప్రజలు, విద్యార్థులు, మెడికల్ ప్రొఫెషనల్స్ ఇబ్బందులు పడకతప్పదు. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు మా హోటల్ ఇండస్టీ ఇబ్బందులు పడక తప్పదు. ఈ విషయంలో కేంద్రం త్వరగా సరైన చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొంది. చెన్నై హోటల్స్ అసోసియేషన్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో .. ’పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే డిస్టిబ్యూటర్లు గ్యాస్ సిలిండర్ల సపెí్లని పూర్తిగా ఆపేశారు. స్టాక్ లేదని అంటున్నారు. దీని ఫలితంగా చాలా హోటళ్లు బలవంతంగా మూసేయాల్సి వస్తోంది’ అని పేర్కొంది. ’ది నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై స్పందించింది. ఈ మేరకు సోమవారం ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ’రెస్టారెంట్ ఇండస్టీక్రి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఎటువంటి నిషేధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. సప్లయర్లు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు. ఇది రెస్టారెంట్ ఇండస్టీపై, ఆహార సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది’ అని రాసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కలుగజేసుకోవాలని కోరింది. ఒక్కో వాణిజ్య సిలిండర్‌ను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బ్లాక్ విక్రయాలను అరికట్టేందుకు సిలిండర్ల బుకింగ్ వ్యవధిని ప్రస్తుతమున్న 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. అలాగే చమురు సంస్థలపై నిత్యావసర సరకుల చట్టాన్ని ప్రయోగించింది
ఇరాన్ యుద్ద ప్రభావంతో ధరల మోత
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మనదేశ నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం చూపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్, ఎరువుల దిగుమతులకు ఆటంకం ఏర్పడడంతో, అతి త్వరలోనే వీటి నిల్వలు నిండుకుంటాయని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సంర్భంలో గ్యాస్ ధరలు పెరిగాయి. అలాగే పెట్రో ధరలు పెరుగాయని అంటున్నారు. వీటి ప్రభావంతో నిత్యాసవరాలు కూడా పెరగక తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ముఖ్యంగా పెట్రోల్ ధరలు పెరుగుతాయనే వార్తలను ఖండించింది. కొంతపాలం పాటు నష్టాలను చమురు కంపెనీలు భరిస్తాయని వెల్లడించింది. రాబోయే 6 నుంచి 8 వారాల వరకు ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రోల్ నిల్వలు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. అలాగే ఎల్పీజీ సిలిండర్ల నిల్వలు కూడా ప్రస్తుతానికి సరిపోతాయని పేర్కొంది. అయితే గ్యాస్ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 25 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు ఈ వ్యవధి 21 రోజులు ఉండేది. మనదేశంలో సగటున ఒక కుటుంబం ఏడాదికి 7 నుంచి 8 సిలిండర్లను మాత్రమే వినియోగిస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. లాగే రాబోయే ఖరీఫ్ సీజన్‌కు సరిపడా ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయని ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది (ఈ।సబిత్గిªతిళి।స ªఔసతిఞ।బ ఎనిటతిజీ). అయితే ప్రస్తుత భౌగోళిక ఉద్రిక్తతలు, గ్యాస్ సరఫరాలో కోత యూరియా ఉత్పత్తులపై ప్రభావం చూపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం 177.31 లక్షల టన్నుల ఎరువులు నిల్వలున్నట్టు తెలిపింది. వాటిల్లో 59.30 లక్షల టన్నుల యూరియా, 25.13 లక్షల టన్నుల డీఏపీ, 55.87 లక్షల టన్నుల ఎన్‌పీకేఎస్ నిల్వలున్నాయని పేర్కొంది.
ఎల్పీజీ ఉత్పత్తిని పెంచండి
` గ్యాస్ కంపెనీలకు కేంద్రం ఆదేశం
` పెట్రో కంపెనీలతో కమిటీ ఏర్పాటు
` చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
` కేంద్రమంత్రులతో ప్రధాని మోడీ అత్యవసర భేటీ
` పెట్రో, గ్యాస్ నిల్వలు, సరఫరాలపై సవిÖక్ష
న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ కొరత పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర పెట్రోలియం శాఖ రంగంలోకి దిగింది. గ్యాస్ ఉత్పత్తిని తక్షణమే పెంచాలని ప్రభుత్వ, పైవేట్ రంగ ఇంధన కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కనీసం 10శాతం గ్యాస్ ఉ త్పత్తిని పెంచాలని కేంద్రం ఆదేశించింది. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాల వల్ల సరఫరాలో ఏర్పడిన ఆటంకాలను అధిగమించి, దేశీయ అవసరాలకు తగినంత స్టాక్ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం సూచించింది. సామాన్య ప్రజలకు వంట గ్యాస్ ఇబ్బందులు కలగకుండా చూడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. ఇరాన్ యుద్ధం భారత్‌లో చమురు ఆందోళనలు రేకెత్తిస్తోంది. దేశ ప్రజలకు ఇంధన, గ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ కీలక భేటీ నిర్వహించారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో చర్చలు జరిపారు. ఎల్‌పీజీ ఉత్పత్తులు, సరఫరాపై సవిÖక్ష జరిపారు. ఇరాన్ యుద్ధం సామాన్యులపై ప్రభావం చూపకూడదని ప్రధాని మోదీ మంత్రులకు తెలిపారు. అలాగే యుద్ధంతో ఉత్పన్నమయ్యే అంతరాయాల గురించి చర్చించారని జాతీయ విÖడియా కథనాలు వెల్లడించాయి. మరోవైపు పరిశ్రమల నుంచి గ్యాస్‌ను మళ్లించడం ద్వారా ప్రజలకు గ్యాస్ కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఇరవై ఒక్క రోజుల తర్వాత బుకింగ్‌లు జరిగేవి, ఇప్ప్పుడు25 రోజులకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలానే ఎల్పీజీ ఉత్పత్తిని 10 శాతం పెరిగిందని కేంద్ర వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్`అమెరికా, ఇరాన్ యుద్ధంతో హర్మూజ్ జలసంధి నుంచి నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్‌కు కత్రిమ కొరత కలగకుండా కేంద్రం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రయోగించింది. బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను నియంత్రించే ఉద్దేశంతో పెట్రోలియం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో దాదాపు రెండున్నర లేదా మూడు రోజుల్లో వినియోగదారులకు గ్యాస్ సరఫరా జరిగేది, ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అదే సమయం పడుతుందని వర్గాలు తెలిపాయి. అన్ని శుద్ధి కర్మాగారాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి, దేశవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఎల్‌పీజీ కొరత లేదని, సరఫరాను స్థిరీకరించామని కేంద్ర ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా దేశంలో పలు హోటళ్లు, రెస్టారంట్లు మూతపడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల నేపథ్యంలో కేంద్రం నుంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి రిఫైనరీలు ఎల్‌పీజీ ఉత్పత్తిని 10శాతం మేర పెంచాయని పేర్కొన్నాయి. కత్రిమ కొరతను నిరోధించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాయి. ఎల్‌పీజీ సరఫరా విషయంలో సమస్యలను అర్థం చేసుకునేందుకు చమురు మార్కెటింగ్ కంపెనీలు వివిధ రెస్టారంట్ అసోసియేషన్లతో మాట్లాడుతాయి. ఇందుకోసం ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఓ కమిటీ ఇప్పటికే ఏర్పాటైంది. హోటళ్లు, రెస్టారంట్ల అవసరాలకు తగ్గట్టుగా కమిటీ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే కొన్నిరోజుల వ్యవధిలోనే దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తి 10 శాతం మేర పెరిగింది. ఎల్‌పీజీ, ఎలఎన్‌జీ కన్‌సైన్‌మెంట్ వివిధ వనరుల నుంచి వస్తోంది. కొత్త కన్‌సైన్‌మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో మనం గతంలో సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొన్నాం కానీ.. ఇప్ప్పుడు అలాంటివి ఏవిÖ లేవు. ఇరాన్`ఇజ్రాయెల్ ఘర్షణకు ముందువలే భారత రిఫనరీలు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. మన ముడిచమురు దిగుమతుల్లో 70 శాతం హర్మూజ్ జలసంధి నుంచి కాకుండా ఇతర వనరుల నుంచి సమకూరుతున్నాయి. ఇక సంక్షోభం తర్వాత ఇతర దేశాల కంటే మనమే మెరుగ్గా మనం కోలుకుంటాం. అంతేగాకుండా శుద్ధిచేసిన చమురు ఎగుమతులను నియంత్రించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
చమురు శుద్ధి సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరకుల చట్టాన్ని ప్రయోగించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌కు కత్రిమ కొరత సష్టించకుండా ఈ నిర్ణయం తీసుకుంది. వీటి సరఫరాకు అంతరాయం కలగకుండా, పంపిణీ సమానంగా జరిగేలా తాజాగా పెట్రోలియం శాఖ ఈ చర్యలు చేపట్టింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. దేశంలో చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగకుండా కేంద్రం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను ఆదేశించింది. దేశీయ సరఫరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన సంగతి తెలిసిందే. బ్లాక్ విక్రయాలను అరికట్టేందుకు సిలిండర్ల బుకింగ్ వ్యవధిని ప్రస్తుతమున్న 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. ఇక, వాణిజ్య సిలిండర్ల సరఫరాను సవిÖక్షించేందుకు చమురు మంత్రిత్వశాఖ ఓ కమిటీని ఏర్పాటుచేసింది. మరోవైపు.. దేశంలో పెట్రో ధరలు ఇప్పటికిప్పుడు పెరగబోవని, చమురు కంపెనీల వద్ద సరిపడా నిల్వలున్నాయని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వచ్చే 6 నుంచి 8 వారాల వరకూ సరిపడినంతగా ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రో నిల్వలు ఉన్నాయని పేర్కొన్నాయి. కత్రిమ కొరత సష్టించకుండా తాజాగా నిత్యావసర సరకుల చట్టాన్ని ప్రయోగించింది.పౌరులకు అందుబాటు ధరల్లో నిత్యావసర సరకులు లభించేలా చూడటం, కత్రిమ కొరతను నిరోధించడం, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను నియంత్రించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 1955లో నిత్యావసర సరకుల చట్టాన్ని తీసుకువచ్చింది. ఆహార భద్రతను కాపాడేందుకు, రిటైల్ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యాక్ట్‌లోని సెక్షన్`3 కింద నిత్యావసరాల ఉత్పత్తి, సరఫరా, పంపిణీని నియంత్రించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడే దిశగా నిల్వల పరిమితిపై ఆంక్షలు విధించగలదు. ధరలను నిర్ణయిస్తుంది. సెక్షన్`3 కింద తనకు లభించిన అధికారాలను కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులకు అప్పగించేందుకు చట్టంలోని సెక్షన్`5 అనుమతిస్తుంది. దాంతో క్షేత్రస్థాయిలో పంపిణీకి అంతరాయం కలగకుండా చూసేందుకు వీలు కలుగుతుంది.
తెలంగాణలో బంద్ దిశగా హోటళ్లు
` సిలిండర్ల సరఫరా నిలిపివేయడమే కారణం
` కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై పెట్రోలియం కంపెనీల నియంత్రణ
` హోటళ్లకు సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని డీలర్లకు కేంద్రం ఆదేశాలు
` హోటల్స్ నిర్వహించలేమని బంద్ పాటించే యోచన
హైదరాబాద్(జనంసాక్షి):పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల యుద్ధ ప్రభావం, హర్మూజ్ సంధిలో చమురు నౌకల రాకపోకలపై చిక్కులు మన దేశంలోని హోటళ్ల పరిశ్రమపై పడింది. దీంతో వెంటనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై పెట్రోలియం కంపెనీలు నియంత్రణ చర్యలకు పూనుకున్నాయి. హోటళ్లకు సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని ఆయా సంస్థలు తమ డీలర్లకు ఆదేశాలు జారీ చేశాయి. ఆస్పత్రులు, హాస్టళ్లకు మాత్రమే కమర్షియల్ సిలిండర్లు సరఫరా చేయాలని పెట్రోలియం యాజమాన్యాలు స్పష్టంగా పేర్కొన్నాయి.కమర్షియల్ గ్యాస్ కొరతతో దేశవ్యాప్తంగా హోటల్ పరిశ్రమ ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. ముంబై, బెంగళూరు, చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లోని హోటళ్లకు ఉరుము ఉరిమి మంగళం విÖద పడ్డట్లు గ్యాస్ ఇబ్బందులను తెచ్చిపెట్టింది. గ్యాస్ కొరతతో ఇప్పటికే దేశవ్యాప్తంగా చిన్న చిన్న హోటళ్లు మూతబడుతున్నాయి. గ్యాస్ వినియోగదారులు తప్పకుండా ఈ`కేవైసీ చేసుకోవాలని సూచించాయి. అలా చేసుకోని గహ వినియోగదారులకు సైతం ఇక నుంచి గ్యాస్ బుకింగ్ నిలిచిపోనుంది. ఇటీవల గహ వినియోగ సిలిండర్ బుకింగ్ వ్యవధిని 20 నుంతి 25 రోజులకు కేంద్ర ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే.గ్యాస్? కొరతపై స్పందించిన డిస్టిబ్యూటర్ల అసోసియేషన్ : తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ కొరతపై డిస్టిబ్యూటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి స్పందించారు. మన రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎల్పీజీ కొరత వచ్చే అవకాశం లేదని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇబ్బందులు ఎదురవకుండా మాత్రమే కేంద్రం అప్రమత్తమైందని తెలిపారు. గహ వినియోగదారులకు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే వ్యాపార, హోటల్స్‌కు సిలిండర్లను నిలుపుదల చేస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.డిస్టిబ్యూటర్ల నుంచి 19 కిలోల వాణిజ్య సిలిండర్ల సరఫరా దాదాపు ఆగిపోయింది. హాస్టళ్లకు, ఆస్పత్రులు లాంటి అత్యవసర విభాగాలకు ఎస్మా నుంచి మినహాయింపును ఇచ్చారు. గ్యాస్ సరఫరా విషయంలో కొన్ని విభాగాలకు పరిమితులు విధించారు. యుద్దం కారణంగా సరిపడినంత గ్యాస్ సరఫరా లేకపోవడంపై ఉన్నత స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న గ్యాస్ ఏయే రంగాలకు సరఫరా చేయాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నారు. కమిటీ సిఫారసుల మేరకు ఆయిల్ కంపెనీలు గ్యాస్ సరఫరాను కొనసాగించనున్నాయి. గహ వినియోగదారులు గ్యాస్‌ను పొదుపుగా వాడుకోవాలని, అవకాశం ఉన్నంత వరకు ఇండక్షన్ స్టవ్ లాంటి వాటిని వాడుకోవాలని అధికారులు సూచించారు.హైదరాబాద్‌లో తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసరంగా సమావేశమైంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ దిగుమతులు తగ్గిపోవడం పట్ల హోటల్స్ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. హోటళ్ల పరిశ్రమకు గ్యాస్ ప్రాణవాయువు లాంటిదని, గ్యాస్ నిల్వలు తగ్గిపోయి కొరత ఏర్పడడంతో హోటల్ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కమర్షియల్ గ్యాస్ నిలిపివేయడంతో తమ వ్యాపారానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లేని వాపోయారు.ఈ పరిస్థితులన్నింటి దష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా హెటల్స్ బంద్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి తెలిపారు. హోటళ్లలో వంట చేయడానికి సరిపడా గ్యాస్ లేకపోవడంతో తీవ్ర సమస్య ఎదురవుతోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి సాయం చేయాలని కోరారు. ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాలను చూపించకుంటే హోటల్స్‌ని తప్పనిసరిగా మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఇప్పటికే ముంబై, బెంగళూరు వంటి నగరాలలో హోటల్స్‌బంద్ నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు.



