ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలి…. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

 

 

 

 

ములుగు బ్యూరో,మార్చి10(జనం సాక్షి):-రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందిస్తుందని మొదటి విడతలో మంజూరు అయిన లబ్ధిదారులు తమ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరిత గతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం 99 రోజులు నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.వెంకటాపూర్ మండల కేంద్రంలో,నల్లగుంట,ఎల్లారెడ్డి పల్లె గ్రామాలలోని నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను,గ్రామాల్లో జరుగుతున్న పరిశుభ్రత కార్యక్రమాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూవెంకటాపూర్,నల్లగుంట, ఎల్లారెడ్డిపల్లె గ్రామాల్లో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని వాటిలో ఎన్ని ఇండ్లు నిర్మాణాలు పూర్తి అయ్యాయని, మిగిలినవి ఏ ఏ దశలో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ ను లబ్ధిదారులకు తక్కువ ధరకు ఇప్పించి ఇండ్ల నిర్మాణపు పనులు త్వరగా పూర్తి అయ్యేలా కృషి చేయాలన్నారు. ఇప్పటి వరకు నిర్మాణం అయినంత వరకు లబ్ధిదారుల అకౌంట్ లలో డబ్బులు జమ అవుతున్నాయా అని ఆరా తీశారు.ఏ కారణాల చేత ఇండ్ల నిర్మాణాలు పెండింగ్ లో ఉన్నాయి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు.వివిధ దశలో మిగిలి ఉన్న నిర్మాణ పనులను కూడా పూర్తి చేస్తే చివరి బిల్లు కూడా వస్తుందని త్వరగా పూర్తి చేసుకొని ఉగాది పండుగ వరకు గృహ ప్రవేశాలు చేపట్టాలన్నారు. మంజూరు చేసిన ఇళ్లను లబ్ధిదారులు ఏప్రిల్ నెలలో పనులు ప్రారంభించక పోతే రద్దు చేసే అవకాశం ఉంటుందని అన్నారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఇల్లు మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,పరిశుభ్రత ద్వారా అనేక రకాల సీజనల్ వ్యాధులను నివారించవచ్చని అన్నారు.పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు కూడా ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని స్వచ్ఛమైన పరిసరాల నిర్మాణానికి సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి సూర్యనారాయణ, వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ మామిడి శెట్టి సుగుణ,రామప్ప ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మెన్ మిల్కురి ఐలయ్య, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు