ఒలంపియాడ్ పోటీ పరీక్షలో ప్రతిభను కనబరిచిన మై డ్రీమ్ స్కూల్ విద్యార్థులు

వరంగల్ ఈస్ట్ , మార్చి13 (జనం సాక్షి)ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ అంతోటి రామకృష్ణ ఆధ్వర్యంలో మూడు జోన్లలో నిర్వహించిన పోటీ పరీక్షకు సుమారు 20వేల మంది విద్యార్థులు హాజరు కాగా ఈ పరీక్షలో ప్రతిభను కనబరిచినటువంటి విద్యార్థులకు ఫిబ్రవరి 22న హైదరాబాద్ శేర్లింగంపల్లిలో గల అభ్యసన ద స్కూల్ లో న జాతీయస్థాయిలోపోటీపరీక్షనిర్వహించడంజరిగింది.ఈపోటీపరీక్షల్లోనగరంలోనిరంగశాయిపేటలో గల మై డ్రీమ్ పాఠశాల నుండి ఎం అఖిల్ థర్డ్ క్లాస్ సైన్స్ విభాగం, వై సాయి ప్రత్యూష్ ఫోర్త్ క్లాస్ నుండి మ్యాథ్స్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభను కనబరిచి స్టేట్ టాపర్లుగా నిలిచారు. ఈ విద్యార్థులకు హైదరాబాద్ కింగ్ కోటిలోని భారతీయ విద్యా భవన్ లో బుధవారం సాయంత్రం నిర్వహించిన జాతీయ స్థాయి అవార్డుల ప్రధానోత్సవానికి హాజరైన ముఖ్య అతిథులు సినీ హీరో శివబాలాజీ, అంజలి రాజ్ దాస్, డాక్టర్ భువనేశ్వరి, డాక్టర్ శ్రీ పూజ, డాక్టర్ జీవన్ రెడ్డి, సువాసిని, కపిల్ దేవ్, విపి పుష్ప, రజిని, ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ సంస్థ డైరెక్టర్ అంతోటి రామకృష్ణ చేతుల మీదుగా అవార్డులను ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మై డ్రీమ్ పాఠశాల కరస్పాండెంట్ కూసూరి శ్రీనివాస్ గౌడ్ కు ఉత్తమ కరస్పాండెంట్ అవార్డును ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి మరిన్ని పోటీ పరీక్షలకు హాజరై మరింత ప్రతిభను కనపరిచి జాతీయస్థాయిలో మరిన్ని అవార్డులను అందుకోవాలాని కోరారు. ఈ విజయానికి సహకరించిన అధ్యాపక బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

తాజావార్తలు