పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

 

 

 

 

 

పర్వతగిరి మండల విద్యా శాఖాధికారి ఏ బిక్షపతి.

పర్వతగిరి: మార్చి 13: (జనం సాక్షి)పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు పర్వతగిరి మండల విద్యాశాఖ అధికారి ఏ బిక్షపతి తెలిపారు. రెండు పరీక్ష కేంద్రాల ఇన్విజిలేటర్లు మరియు చీఫ్ సూపరెండెంట్ లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్ లతో ఈరోజు సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఇన్విలేటర్లు తీసుకోవలసిన జాగ్రత్తలను, మార్గదర్శకాలను వారికి వివరించడం జరిగిందనీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్వతగిరి మండలంలో మొత్తం 12 ప్రభుత్వ పాఠశాలలు 4 ప్రైవేట్ పాఠశాలల నుండి మొత్తం 530 మండి విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పర్వతగిరి మండల కేంద్రంలో పర్వతగిరి ఉన్నత పాఠశాల మరియు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లను పరీక్ష కేంద్రాలు గా ఏర్పాటు చేశామని తెలిపారు. పర్వతగిరి ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో 290 మంది విద్యార్థులు సాంఘిక సంక్షేమ బాలికల విద్యాలయం పరీక్ష కేంద్రం లో 240 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. రెండు పరీక్ష కేంద్రాల్లో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం చీఫ్ సూపరెండేంట్ నవీన్ కుమార్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కుమారస్వామి, పర్వతగిరి గురుకుల పాఠశాల పరీక్షా కేంద్రం చీఫ్ సూపరెండెంట్ హేమమాలిని, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు