నిరుపేదలకు సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యం: ఎమ్మెల్యే జీఎస్సార్

 

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):నిరుపేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండలం నగరంపల్లి, మైలారం గ్రామాలలో వెలగం రాజయ్య, చిలుక రంజిత్ ల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తికాగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత పథకాల వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా గృహం లేని నిరుపేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం ప్రభుత్వం సహాయం అందిస్తుందని, ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి లోకిలాల్, ఎమ్మార్వో సత్యనారాయణ స్వామి, గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.