బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన పొన్నం అశోక్ గౌడ్ ను కలిసిన సిరాజ్ హుస్సేన్

 

 

 

 

 

 

 

 

కరీంనగర్, మార్చి 13 (జనంసాక్షి)తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ మొదటి సభ్యుడిగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ను హైదరాబాదులోని హైకోర్టులో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పొన్నం అశోక్ గౌడ్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సిరాజ్ హుస్సేన్ మాట్లాడుతూ… సీనియర్ న్యాయవాదిగా సుదీర్ఘ అనుభవం కలిగిన పొన్నం అశోక్ గౌడ్ బార్ కౌన్సిల్ మెంబర్ గా ఎన్నిక కావడం అభినందనీయమన్నారు. అదేవిధంగా బార్ కౌన్సిల్ ను ఒక మోడల్ గా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించనున్నారని పేర్కొన్నారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో పొన్నం అశోక్ గౌడ్ బార్ కౌన్సిల్ కు దేశంలోనే ఒక మంచి గుర్తింపు తీసుకొస్తారని సిరాజ్ హుస్సేన్ పేర్కొన్నారు.