యుద్ధం ఉగ్రరూపం
` ఊహించని దాడులు చేస్తాం: అమెరికా
` దేఖ్‌లేంగే అంటున్న ఇరాన్
` ఇజ్రాయెల్, సౌదీ, కువైట్‌లపై ప్రతిదాడి
` దీర్ఘకాల యుద్ధానికి సిద్ధమని ప్రకటన
` చమురు నిక్షేపాల వైపు వచ్చిన 2 డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ రక్షణశాఖ ప్రకటన
` 6 డ్రోన్లను తమ నేషనల్ గార్డ్ కూల్చివేసిందని కువైట్ ప్రభుత్వం ప్రకటన
` ఇరాన్‌తో యుద్ధం వేళ.. పుతిన్‌కు ట్రంప్ ఫోన్ కాల్
టెహ్రాన్(జనంసాక్షి):పశ్చిమాసియాలో 11వ రోజు భీకరయుద్ధం జరుగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ 33వ విడత డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికాకు చెందిన రెండు అత్యాధునిక రీపర్ డ్రోన్లను ధ్వంసం చేసిన వీడియోను ఇరాన్ పంచుకుంది. అటు తుర్కియోలోకి ప్రవేశించిన ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్‌ను నాటో కూల్చివేసింది. బహ్రెయిన్‌లో ఇరాన్ భారీ డ్రోన్ దాడి చేసింది.19 వందల మందికి పైగా ఇరాన్ సైనికులు చనిపోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆరు విమానాశ్రయాలపై దాడి చేసినట్లు పేర్కొంది. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్` ఇరాన్ నాయకుల మధ్య మాటల యుద్ధం ముదిరింది. మంగళవారం ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు ట్రంప్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘త్యాగాలకు సిద్ధపడే ఇరాన్ నీ బెదిరింపులకు భయపడదు’ అని ఘాటు స్పందించారు. ట్రంప్ కంటే హేమాహేవిÖలే ఇరాన్‌ను ఏవిÖ చేయలేకపోయారని పేర్కొన్నారు. ఇరాన్‌ను అంతం చేయాలని చేస్తే నీకే ఆ గతి పడుతుందని జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.
ఇరాక్‌లోని యూఏఈ కాన్సులేట్‌పై డ్రోన్ దాడి
ఇరాక్‌లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధంలో అనవసరంగా తాము చిక్కుకొన్నట్లు యూఏఈ వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం. కుర్దిష్ ప్రాంతంలో ఉన్న ఈ కాన్సులేట్ మంగళవారం జరిగిన దాడిలో స్వల్పంగా దెబ్బతిందని అధికారులు పేర్కొన్నారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. తాజా దాడిని యూఏఈ విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. ఇది ప్రాంతీయ భద్రతకు, స్థిరత్వానికి తీవ్ర ముప్పుగా పేర్కొంది. ఇలా దౌత్య కార్యాలయాలను, ప్రాంగణాలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. యూఏఈ ప్రభుత్వం ఈ దాడిని ఖండించినప్పటికీ.. డ్రోన్ దాడి ఎవరు చేశారనే విషయాన్ని వెల్లడించలేదు. ఇక, ఇరాక్‌లోని అమెరికా ఎయిర్‌బేస్ లక్ష్యంగా దాడి చేసినట్లు ఐఆర్‌జీపీ పేర్కొంది. అమెరికా సైనిక స్థావరంపై ఐదు క్షిపణులను ప్రయోగించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.అమెరికా` ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంలో తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడంపై యూఏఈ అసంతప్తి వ్యక్తంచేసింది. అనవసరంగా తమను మధ్యలోకి లాగుతున్నారని వ్యాఖ్యానించింది. ఇరాన్‌పై దాడుల్లో పాల్గొనడం లేదని.. యుద్ధంలోకి తాము రావాలనుకోవడం లేదని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఇరాక్‌లోని ఆ దేశ కాన్సులేట్ లక్ష్యంగా దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక, పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తమ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకునేందుకు యూఏఈ సిద్ధమైంది. ముందుజాగ్రత్త చర్యలో భాగంగా ఈ ప్రాంతానికి తమ క్షిపణులు, విమానాలను పంపుతున్నట్లు ఆస్టేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ పేర్కొన్నారు. బోయింగ్ సంస్థ రూపొందించిన ఇ`7ం వెడ్జ్‌టైల్ అనే విమానాన్ని కూడా పంపుతున్నట్లు తెలిపారు. ఇది నాలుగు వారాలపాటు గల్ఫ్‌దేశాల గగనతలాన్ని పర్యవేక్షిస్తుందని వెల్లడించారు.
అమెరికాకు రక్షణ కవచాల కొరత!
“మేం ఆయుధాల కొరతను ఎదుర్కోవడం లేదు. ఎప్పుడూ లేనంతగా మా దగ్గర నిల్వలు ఉన్నాయి” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం చెబుతున్నా.. రక్షణ నిపుణులు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇరాన్‌తో యుద్ధం మూడు నుంచి నాలుగు వారాలు దాటి కొనసాగితే ఆయుధాల కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత యుద్ధంలో ఇరాన్ చౌకగా తయారు చేసిన డ్రోన్లను భారీ సంఖ్యలో వినియోగిస్తోంది. ఒక్కో డ్రోన్ ధర కేవలం 20 వేల నుంచి 50 వేల డాలర్లలోపే. అయితే వీటిని ఎదుర్కోవడానికి అమెరికా వినియోగిస్తున్న ఒకొక్క ఇంటర్‌సెప్టర్ క్షిపణి ధర మాత్రం 1.5 మిలియన్ డాలర్ల పైమాటే. ఆర్థికపరమైన ఈ అంతరం యుద్ధంలో అమెరికాపై ప్రభావం చూపనుందని నిపుణులు అంటున్నారు. పోరు మొదలైన 100 గంటల్లోనే 2 వేలకు పైగా స్మార్ట్ బాంబులను అగ్రరాజ్యం ప్రయోగించింది. వీటి ఖరీదే.. 3.7 బిలియన్ డాలర్లు. అంతేకాదు.. వందల సంఖ్యలో ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులను అడ్డుకోవడానికి అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఇంటర్‌సెప్టర్లను అగ్రరాజ్యం వినియోగించాల్సి వస్తోంది. అత్యంత ఖరీదైన గగనతల రక్షణ వ్యవస్థలతో(పేట్రియాటిక్, థాడ్) ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో వీటి నిల్వలు భారీగా తరిగిపోతున్నాయని వార్తలొస్తున్నాయి.
రాడార్ వ్యవస్థలే లక్ష్యం
అమెరికా క్షిపణులను, వైమానిక దాడులను అడ్డుకోవడం కష్టమని ఇరాన్‌కు తెలుసు. అందుకే గగనతలంలో అగ్రరాజ్యానికి కళ్లు, చెవులుగా పనిచేసే రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంది. సౌదీ అరేబియా, జోర్డాన్, బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈల్లో ఈ వ్యవస్థలు ఉన్నాయి. వీటిపై గురిపెట్టి.. ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో జోర్డాన్‌లో అమెరికా స్థావరంలోని దాదాపు 300 మిలియన్ డాలర్ల విలువైన థాడ్ రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది. ఈ రాడార్ లేకపోతే క్షిపణులు ఎక్కడ నుంచి వస్తున్నాయో గుర్తించడం, అడ్డుకోవడం కష్టమవుతుంది. కువైట్‌లోనూ మూడు రాడార్ వ్యవస్థలకు ఇరాన్ డ్రోన్లు నష్టం కలిగించాయి. సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌లో కీలక రాడార్ వ్యవస్థను ఈ డ్రోన్లు దెబ్బతీశాయి.ఆయుధ నిల్వల విషయంలో అమెరికా అప్రమత్తంగా ఉండాలని సెంటర్ ఫర్ స్టాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎసఐఎస్) ఇటీవల అమెరికాను హెచ్చరించింది. ఆ నివేదిక ఏం చెప్పిందంటే..
2025 డిసెంబరు నాటికి అమెరికా దగ్గర థాడ్ క్షిపణులు 534, ఎస్`3లు 414 ఉన్నాయి.గతేడాది ఇరాన్‌పై జరిగిన 12 రోజుల యుద్ధంలో థాడ్ నిల్వల్లో అమెరికా 20 నుంచి 50 శాతం ఖర్చు చేసేసింది.ఇంటర్‌సెప్టర్ క్షిపణుల తయారీకి ఎక్కువ సమయం పడుతుంది. ఏడాదికి 700 క్షిపణులు తయారు చేసే సామర్థ్యం అమెరికా సంస్థలకు ఉంది.సాధారణ మందుగుండు సామగ్రి విషయంలో కొరత లేకపోయినా.. థాడ్, పేట్రియాట్, సీఎం`3 లాంటి అత్యాధునిక ఆయుధ వ్యవస్థల విషయంలో అమెరికా ఇబ్బందులు ఎదుర్కోనుంది.
ఇరాన్‌తో యుద్ధం వేళ.. పుతిన్‌కు ట్రంప్ ఫోన్ కాల్
ఇరాన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌లో చర్చలు జరిపినట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వెల్లడించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇరాన్‌తో యుద్ధం, ప్రపంచ చమురు సరఫరాలో అనిశ్చితి, ఉక్రెయిన్, రష్యా, అమెరికా త్రిముఖ చర్చల గురించి ఇరువురు నేతలు దాదాపు గంటసేపు మాట్లాడుకున్నట్లు తెలిపింది. యుద్ధం కారణంగా తమ మిత్ర దేశమైన ఇరాన్ పెద్ద మొత్తంలో నష్టపోతుండడంపై రష్యా అధ్యక్షుడు ఆందోళన వ్యక్తంచేసినట్లు పేర్కొంది.పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధం ముగింపునకు తీసుకోవాల్సిన దౌత్య చర్యలపై కొన్ని ప్రతిపాదనలను పుతిన్.. ట్రంప్ ముందు ఉంచినట్లు రష్యా విదేశాంగ సలహాదారు యూరి ఉషాకోవ్ తెలిపారు. ఇరాన్‌తో జరుగుతోన్న యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ట్రంప్‌నకు సూచించినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు విషయంపై అమెరికా ప్రతినిధులతో జరుగుతోన్న ద్వైపాక్షిక చర్చల పైనా వారు మాట్లాడుకొన్నట్లు ఉషాకోవ్ పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ నూతన సుప్రీంతో చర్చలు జరిపిన పుతిన్ టెహ్రాన్‌కు తాము సంపూర్ణ మద్దతిస్తామని హావిÖ ఇచ్చారు. ఇదీ చదవండి: చమురు ఆంక్షలపై ట్రంప్ కీలక నిర్ణయం
ఇరాన్‌తో యుద్ధం త్వరలోనే ముగుస్తుంది
` ఇంధన ధరలు దిగి వస్తాయి
` ట్రంప్ సంచలన ప్రకటన
` ఇరాన్ హెచ్చరికలతో వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు
వాషింగ్టన్(జనంసాక్షి): ఇరాన్‌పై యుద్దం కొనసాగుతుందని,వెనక్కి తగ్గేది లేదన్న ట్రంప్ కొంత మెత్త బడ్డారు. వెనక్కి తగ్గుతున్నట్లుగా కనిపిస్తున్నారు. ఇరాన్ కూడా గట్టి హెచ్చరికలు చేయడంతోనో ఏమో యుద్దానికి త్వరలోనే ముగింపు దొరుకుతుందని అన్నారు. ఇరాన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని, చమురు ధరలు కిందకు దిగి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ విషయంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి చేరువలో ఉన్నామని, ఇరాన్‌పై దాడిని, మధ్యప్రాచ్యంలోని చెడును వదిలించడానికి అమెరికా చేసిన విహారయాత్రగా ట్రంప్ అభివర్ణించారు. ఆ విహారయాత్ర స్వల్పకాలికంగానే ఉంటుందని తెలిపారు. మియామి గోల్ఫ్ క్లబ్‌లో రిపబ్లికన్ చట్ట సభ్యులతో జరిగిన సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. ’ఇరాన్ యుద్ధం ఈ వారంలోనే ముగుస్తుందా’ అనే ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. ’లేదు. కానీ త్వరలోనే ముగుస్తుంది’ అని జవాబిచ్చారు. ’మా సైనిక లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా పెద్ద అడుగులు వేస్తున్నాం. ఇరాన్‌లోని బలగాలను పూర్తిగా తుడిచిపెట్టేశాం. అంతర్జాతీయ చమురు సరఫరాకు అంతరాయం కలిగిస్తే ఉపేక్షించేది లేదు. అలా చేస్తే ఇరాన్‌ను పూర్తిగా ధ్వంసం చేస్తాం’ అని ట్రంప్ హెచ్చరించారు. మెరికా, ఇజ్రాయెల్‌పై దాడిని పొడిగించేందుకు ఇరాన్‌కు తగినంత సామర్థ్యం లేదు కాబట్టి, యుద్ధం త్వరలోనే ముగిసిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా`ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఆయన వారసుడిగా మొజ్తాబా ఖమేనీ ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా మొజ్తాబాను ఎంపిక చేయడం పట్ల తాను చాలా నిరాశ చెందానని, అయితే కొత్త సుప్రీం లీడర్‌పై దాడి చేసే ఉద్దేశం తనకు లేదని ట్రంప్ తెలిపారు.
అందుకే ఇరాన్ నౌకలను ముంచేస్తున్నాం: ట్రంప్
ఇరాన్‌తో యుద్ధం ప్రారంభం అనంతరం ఇప్పటివరకు 5వేల లక్ష్యాలను ఛేదించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. తమ దాడులతో ఇరాన్ క్షిపణి సామర్థ్యం 10 శాతానికి పడిపోయిందన్నారు. మూడున్నర రోజుల్లో ఆ దేశానికి చెందిన 46 అగ్రశ్రేణి నౌకలను యూఎస్ మిలిటరీ ముంచేసిందంటూ వెల్లడించారు. ఈ సందర్భంగా సైనిక అధికారులతో జరిగిన సంభాషణను ప్రస్తావించారు.“ఇరాన్ డ్రోన్, క్షిపణి సామర్థ్యం పూర్తిగా ధ్వంసమవుతోంది. 46 నౌకలను ముంచేశామంటే నమ్మగలరా..? ఈ విషయంలో మన సైన్యంతీరు నాకు అంతగా నచ్చలేదు. దాంతో వెంటనే సైనికాధికారులతో మాట్లాడాను. ఆ నౌకలు ఎలాంటివని అడిగాను. అవి అగ్రశ్రేణి నౌకలని చెప్పారు. ‘మరి అలాంటప్పుడు స్వాధీనం చేసుకొని మనం వాడుకోవచ్చు కదా..! ఎందుకు ముంచేశారు..?’ అని ప్రశ్నించాను. వాటిని ముంచడం సరదాగా ఉందని, అలా చేయడమే సురక్షితమని సమాధానం ఇచ్చారు. నాక్కూడా అది నిజమేనని అనిపించింది. ఇక మన సైన్యం ఇప్పుడు పశ్చిమాసియాకు విహారయాత్రకు వెళ్లింది. కొంత చెడును వదిలిస్తోంది. ఆ యాత్ర కొద్దికాలమే ఉంటుంది. అది విÖరు కూడా చూస్తారు. శత్రువును పూర్తిగా ఓడించేవరకు మన మిలిటరీ వెనకడుగు వేయదు” అనిపేర్కొన్నారు.



