అధికారుల కార్యాలయం ముందు చెట్ల పర్యవేక్షణ ఎక్కడ

 

 

 

 

 

 

గంభీరావుపేట మార్చి 13 (జనం సాక్షి);అలాదకరమైన పచ్చదనం కొరకు పలు కార్యాలయాలు ముందట మొక్కలు నాటారు కానీ వాటి పర్యవేక్షణ మాత్రం చూడటం లేదు మండల ప్రజలు వివిధ పనులపై కార్యాలకు వచ్చే పోయే వారికి పచ్చని చెట్ల కింద సేద తీర్చుకునేందుకు మొక్కలు నాటారు, కానీ ఆ చెట్లకే పర్యవేక్షణ లేకుండా పోయిందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని తాసిల్దార్ కార్యాలయం మరియు మేజర్ గ్రామపంచాయతీ ముందర చెట్లు నాటారు, కానీ నీరు పోయడం మరిచిపోయారు… ఆ చెట్లకు పర్యవేక్షణ లేకుండా పోయింది, ముందే వేసవి కాలం భగ భగ మండుతున్న ఎండలకు ఎక్కడ నిల్చోవాలో తెలవక ఉన్న చెట్ల కింద సేద తీర్చుకుందాం అంటే అవి గాస్త నీరు లేక ఎండు ముఖం పట్టాయి, వీటి పర్వేషణ ఎవరు చూడాలి.. అని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు ఇవి ఇలా ఉంటే పక్కనే మండల ప్రజా పరిషత్ కార్యాలయం, గ్రామీణ ఉపాధి హామీ కార్యాలయం ఉన్నప్పటికీ, అధికారులు మాత్రం చూసి చూడనట్టు పోతున్నారు,ప్రభుత్వం చేపట్టినటువంటి మొక్కల పరిస్థితి ఏమిటి అని ప్రజల ప్రశ్నిస్తున్నారు, ఇప్పటికైనా పలు అధికారులు స్పందించి చెట్ల పర్యవేక్షణ చేపట్టాలని కోరుతున్నారు

తాజావార్తలు