ఒడిశాలో రైలు ఢీకొని వ్యక్తి సహా ఐదు ఏనుగుల మృతి

 

భువనేశ్వర్‌ : డిసెంబర్‌ 30(జనంసాక్షి):  ఒడిశాలోని గంజాం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రంభ ప్రాంతం సమీపంలో ఆదివారం ఉదయం రైలు ఢీకొని ఓ వ్యక్తి సహా ఐదు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా పడి ఉన్న ఏనుగుల మృతదేహాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. మృతున్ని రైల్వే సిబ్బందిగా గుర్తించారు. రైల్వే ఉన్నతాధికారులు, పోలీసులు ఘటనస్థలికి చేరుకుని ఎనుగుల  మృతదేహాలను పరిశీలించారు.