ఒడిషా అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత
ఒడిషా: బొగ్గు కుంభకోణానికి సీఎం నవీన్ పట్నాయకే కారణమని కాంగ్రెస్ కార్యకర్తలు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అక్కడ ఉదిక్త్ర పరిస్థితులు నెలకొనడంతో కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. వాటన్ కెనాన్స్ కూడా ప్రయోగించారు. మరోవైపు కార్యకర్తలు కూడా పోలీసులపై కట్టెలతో దాడి చేశారు. దాడిలో ఓ మహిళ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవలి కాలంలో బొగ్గు కుంభకోణాకి ప్రధాని బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఎన్డీఏ పక్షాలు డిమాండ్ వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.



