ఒప్పందం మేరకు ధాన్యం కొంటాం

share on facebook


`రాష్ట్రం దివాలా తీసింది
` కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి): హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ కేసీఆర్‌ కొత్త నాటకం మొదలుపెట్టారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విూద విష ప్రచారం చేస్తున్నారన్న కిషన్‌రెడ్డి అబద్ధాల భవనం విూదే కేసీఆర్‌ కుటుంబం రాజకీయం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న మేరకు ప్రతి గింజా కొంటామని ఆయన చెప్పారు.ధనిక రాష్ట్రం మిగులు రాష్ట్రం అని కేసీఆర్‌ చెబుతున్నా కాంట్రాక్టర్లకు కూడా డబ్బులివ్వలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని కిషన్‌రెడ్డి తెలిపారు. పంజాబ్‌ రైతులకు పరిహారం ఇస్తామనడంలో తప్పులేదన్న ఆయన మరి రాష్ట్ర రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Other News

Comments are closed.