ఒలింపిక్స్‌లో భారత్‌ బోణీ: గగన్‌ నారంగ్‌కు కాంస్యం

లండన్‌:  ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల సాధనలో బోణీ చేసింది. 10 మీ, ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో భారతీయ క్రీడాకారుడు గగన్‌ నారంగ్‌ కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఈ విభాగంలోనే పోటీపడిన మరో భారతీయ షూటర్‌ అభినవ్‌ బింద్రా తుది పోటీలకు అర్హత సాధించలేకపోయాడు.