ఓ నియంత ఇనుప బూట్ల కింద నలుగుతున్న మానవహక్కులు

 30 ఏళ్ల వరకు ముస్లిం యువతులకు పెళ్లి చేయరాదు
పెళ్లికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
రొహింగ్యా ముస్లింలు నివసించే ప్రాంతానికి కంచె
మయన్మార్‌ వీధుల్లోనే ఖైదీలుగా జీవితాలు
ఓ పట్టణం నుంచి మరో పట్టణానికి వెళ్లరాదు
చదువు, ప్రభుత్వ ఉద్యోగాలు నిషేధం
ఓ మతాన్ని..ఓ జాతిని.ఓ తెగను ఆ దేశం నుంచి సమూలంగా చెరపేయాలని మయన్మార్‌లో సైనిక నియంత థీయన్‌ సీన్‌ కంకణం కట్టుకొన్నారు. రోహింగ్యా తెగ ముస్లింలను ఊచకోత కోస్తూ, తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న సైనిక పాలకులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. బర్మాలో నివసిస్తున్న రోహింగ్యా తెగ ముస్లింలకు అక్కడ ఏ హక్కులు లేవు.ఉండేది అదే దేశంలో ఐనా రెండవ శ్రేణి పౌరులుగా బతుకుతున్నారు. వారికి అక్కడ పౌరసత్వం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు అస్సలు లేవు. వారు నివసిస్తున్న ప్రాంతంలో వీరి నివాసగృహాల చుట్టూ ఇనుప కంచె వేస్తారు. వారు ఇతరులను కలవకూడదు. వారు ఓ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లకూడదు. పట్టణ ప్రాంతాలకు అస్సలే వెళ్లకూడదు. మానవరూపంలో ఉన్న ఓ మృగం సాగిస్తున్న పాలనకు తాలూకు విషాద చాయలివి. మతమేదైనా కావొచ్చు..మనుషులంతా ఒక్కటేనన్న భావన వారికి లేనేలేదు. ఎవరికీ అపకారం చేయరాదన్న దలైలామా మాటలు వారికి అస్సలు గుర్తుకు రావు. 1987లో ఈ అనాగరికపు దేశాన్ని ఐక్యరాజ్యసమితి అల్పాభివృద్ధి దేశంగా ప్రకటించింది. అక్కడ రోహింగ్యా తెగ వారు చదువుకోవడానికి వీళ్లేదు. 30 ఏళ్ల వరకు అమ్మాయిలకు పెళ్లి చేయకూడదు. ఆ తర్వాత పెళ్లి చేయలనుకున్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి..వీరు ప్రభుత్వోద్యోగం చేయరాదు. వీటన్నింగిని గుర్తించిన ఐక్యరాజ్యసమితి అక్కడ జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘన గూర్చి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఐరాస అంతర్జాతీయంగా బర్మాకు అందే సాయాన్ని నిలిపివేసింది. అప్పటినుంచి నిరంతరం ఈ దేశాన్ని గమనించసాగింది. అయితే ఈమధ్య జరుగుతున్న రోహింగ్యా తెగలపై ఊచకోత జరుగుతున్నా ఐరాస మాటైనా మాట్లాడకపోవడం విడ్డూరమే..అమెరికా చెప్పినట్టల్లా తలూపే ఐరాస ముస్లీంలంటేనే అనుమానపు చూపులు చూసే అమెరికాను గమనించి ఈ దారుణ మానవకాండను చూసీ చూడనట్లు వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ప్రంచంలోనే ఒకే దేశంలో నివసిస్తున్న రెండు తెగల పట్ల వేర్వేరు చట్టాలు..వేర్వేరు పాలన అందించే దుర్మార్గమైన దేశంగా ఈ దేశం ఖ్యాతికెక్కింది. అక్కడి భాదితులకు సహాయం చేయాలని మానవత్వంతో ముందుకు వచ్చిన స్వచ్చంద సంస్థలు ఇచ్చే సహయాన్ని కూడా వారికి అందకుండా చేసిన హేయమైన నియంతల దేశం…ఈ దేశంలో న్యాయ వ్యవస్థ లేదు..సైనికుల ఇష్టానుసారం తమ కోర్కెలు కలిగితే వివక్షను ఎదుర్కొంటున్న మహిళలను ఎత్తుకెళ్లి లెక్కలేనన్ని అత్యాచారాలు చేసినా అక్కడ ఇంతవరకు ఎవరూ నోరు విప్పలేదు..న్యాయం,ధర్మం పదాలకు అర్థం లేదు. దేశంలో లెక్కలేనన్ని కేసుల్లో 2000పైగా రాజకీయ ఖైదీలుగా ఉన్నా జైలులో ఉన్నారు. 2010లో అగస్ట్‌లో బర్మా దేశం 7 రాష్ట్రలు,7 ప్రాంతాలుగా విడిపోయింది. బర్మాలో బౌద్దులు మినహా ఎవరూ సైన్యంలో చేరడానికి, ప్రభుత్వోద్యోగాలు చేయడానికి అర్హత లేదు. గత పది సంవత్సరాలలో ప్రక్షాళన పేరుతో 20000 మందికి పైగా ముస్లింలను ఊచకోత కోస్ణిన నియంత ధృయన్‌ సీన్‌ ముస్లీం తెగ రోహింగ్యాను నిర్మూలించారు. బర్మా మొత్తం వైశాల్యం 678,500 చదరపు కిలోమీటర్లు కాగా, 14 రాష్ట్రాలు, 67 జిల్లాలు, 330 తాలూకాలు, 68290 గ్రామలతో ప్రపంచంలో వైశాల్యంలో 40వ స్థానంలో ఉంది. ఈ దేశంలో 90లక్షల రోహింగ్యా తెగకు చెందిన జనాభా నివాసం ఉంటోంది. 1764 వరకు ఈ దేశం ముస్లింల పాలనలో ఉండగా, తర్వాత 1784లో బౌద్ద మత పాలనలోకి వచ్చింది. తర్వాత 1824లో బ్రిటన్‌ ఆధీనంలోకి వచ్చింది. 1948లో బర్మాకు బ్రిటన్‌ నుండి విముక్తి కల్గింది. 1962లో జనరల్‌ నే విజయన్‌ చర్యతో బర్మా మిలిటరీ పాలనలోకి వచ్చింది. 1962-74లో వ్యాపారం, మీడియా తదితర రంగాల్లో మిలిటరీ ఆధిపత్యం కొనసాగుతోంది. 1962లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులను కాల్చిచంపిన ఘన చరిత్ర బర్మా నియంతలది. ఇప్పటికైనా మానమ హక్కుల సంఘాలు, స్వచ్చంద సంస్థలు, ప్రపంచ దేశాలు ఈ దారుణ మారణ కాండను ఆపేందుకు ప్రయత్నించాలి. వారికి మానవత్వపు పరిమళాలను అందించే వారికి జీవితంపై భయాందోళనలను తొలగించి వారి భద్రతకు భరోసానివ్వాలి.