కట్టయ్య విగ్రహం వద్ద ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నివాళి
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 01(జనం సాక్షి)
కరీమాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ ముందు నూతనంగా బొమ్మల్లో కట్టయ్య విగ్రహావిష్కరణ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య ఆధ్వర్యంలో బుద్ధుడు, బి.ఆర్ అంబేద్కర్, బొమ్మల కట్టయ్య విగ్రహాలను ఆవిష్కరించడం జరుగగా మంగళవారం రోజున “ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం” వరంగల్ జిల్లా అధ్యక్షులు పాల రవికుమార్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరాల సందీప్ ముఖ్య అతిథిగా విచ్చేసి మహానుభావుల విగ్రహాలకు పూలమాలలు వేసి గౌరవించి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 1033/1977 తో ఏర్పాటు చేసిన అంబేద్కర్ యువజన సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లాలో బొమ్మల కట్టయ్య నేతృత్వంలో 874 శాఖలు ఏర్పాటు చేసినారని మహానుభావుల అడుగుజాడల్లో బుద్ధుడి మార్గం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలో బొమ్మల కట్టయ్య పయనించారని కోరారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు జవ్వాజి కిషన్ మాట్లాడుతూ శ్రీ బొమ్మల కట్టయ్య విగ్రహాన్ని జాతికి అంకితం చేయాలని అది ఎవరు సొత్తు కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొంగర జగన్, వంగపురి సదానందం, ఐలయ్య, వరుణ్ సందేశ్, సుధాకర్, సుప్రవీణ్, హరీష్, వినయ్, మార్త రాజేష్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.