కఠిన శిక్ష పడేలా చట్టాలు చేయాలి :అన్నా హజారే

రాలెగావ్‌ సిద్ధి: అత్యాచార నేరం చేసినవారికి కఠిన శిక్ష విధించేలా చట్టం రూపొందించాలని, ఈ నేరాలను త్వరితంగా విచారించేందుకు న్యాయవ్యవస్థను సిద్దంచేయాలని సామాజిక వేత్త అన్నాహజారే డిమాండ్‌ చేశారు. అత్యాచారాలపట్ల నిరసన తెలుపుతూ న్యాయం కావాలని దేశవ్యాప్తంగా నినదిస్తున్న యువతకు హజారే తన మద్దతు తెలిపారు. నేరస్తులు, సంఘవిద్రోహశక్తులు ప్రభుత్వ యంత్రాంగాన్ని చూసి ఏమాత్రం భయపడడం లేదనడానికి నిదర్శనం ఢిల్లీ సంఘటన అని ఆయన పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వం చట్టాల్లో మార్పులు తీసుకురావాలని ఆయన సూచించారు.