కళాశాలల తనిఖీ అధికారం ప్రభుత్వానికి ఉంటుంది: హైకోర్టు
హైదరాబాద్: ప్రభుత్వానికి టాస్క్‌ఫోర్స్ ద్వారా కళాశాలలను తనిఖీ చేసే అధికారం ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.కళాశాలల తనిఖీ కోసం జారీ చేసిన జీవో నెం. 64ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో ఈ రోజు విచారణ ముగిసింది. కళాశాలల తనిఖీ నివేదికను ఏఎఫ్‌ఆర్‌సీకి సమర్పించాలని కోర్టు సూచించింది.తనిఖీల తర్వాత చర్యలు తీసుకునేందకు తమ అనుమతి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.



